శివాజీ కి రాజేంద్ర ప్రసాద్ మద్దతు !!

6 May 2015

ఆంద్ర రాష్ట్రానికి ప్రత్యెక హోదా కావాలి అంటూ హీరో శివాజీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజు తో నాలుగవ రోజు కి చేరుకుంది , ఈ నేపధ్యం లలో శివాజీ కి అనేక సంఘాల నుంచీ సంఘీ భావం వ్యక్తం అవుతోంది , ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు , కమెడియన్ , హీరో రాజేంద్ర ప్రసాద్ ఆయన ఆరోగ్యం పైన ఆరా తీసారు . ఆరోగ్యం కి సంబంధించి తగినంత జాగ్రత్త తీసుకోవాలని రాజేంద్ర ప్రసాద్ కోరినట్టు తెలుస్తోంది . ఆంద్ర రాష్ట్రం బీహార్ లాగా మారిపోతుంది అని శివాజీ ఈ సందర్భంగా అన్నారు . అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు శివాజీ రాజేంద్ర ప్రసాద్ కు తెలిపారు . శివాజీ అందరిలో స్ఫూర్తి నింపుతున్నందుకు రాజేంద్ర ప్రసాద్ శివాజీ ని ప్రశంసించారు .