కుర్ర హీరోకు అంత ఆశ లేదంటా..!

26 Apr 2015


ఇటీవల ఓ కుర్ర హీరోకు సంబందించిన ఒక వార్త టాలీవుడ్ మొత్తాన్ని కూడా ఆశ్చయానికి గురిచేసింది. అబ్బో.. ఈ హీరో అప్పుడే.. పెద్ద రేంజ్ కు వెళ్లి పోయాడే.. ఇక ఈ కుర్రాణ్ణి పట్టుకోవటం కష్టం అని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ సందడి మహాకాక మీదకు వెళ్ళాకా.. ఆ వార్తతో నాకు సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ కుర్ర హీరో..!
ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే.. సందీప్ కిషన్. సందీప్ కిషన్ మేనమామ ప్రముఖ కెమెరా మాన్ చోట కె నాయుడు. అల్లుడు ట్రాక్ లో పడటం చూసి .. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని డిసైడ్ అయ్యి… తనకున్న పరిచయాలను లైన్ లో పెట్టి వినాయక్ ను దర్శకుడిగా పెట్టుకుని సమంతాను హీరోయిన్ గా బుక్ చేసి.. సందీప్ కిషన్ ను హీరోగా పెట్టి తానే నిర్మాతగా ఒక సినిమా చేయాలని చోట ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నది ఆ వార్త.
పొతే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు.. నాకు అంత ఆశలేదు అని ప్రకటించి ఆ వార్తకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు సందీప్ కిషన్. ఈ కాంబినేషన్ కుదిరితే బాగానే ఉంటుంది… ఇప్పుడైతే చాన్స్ లేదు అని చెప్పి రూమర్స్ కు కళ్ళేలు వేశాడు.. కాని తన మామయ్య ప్రయత్నం చేస్తున్నాడు అన్న సంగతి గురించి మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అంటే.. మామయ్య ప్రయత్నం చేస్తున్నాడు.. ఎప్పుడైనా క్రేజీ కాంబినేషన్ ఉండొచ్చు అని సంకేతాలు మాత్రం ఇస్తున్నాడు