వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఏళ్లే -ఓ తెలంగాణా రైతు

22 Apr 2015

ఏమైనా వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఏళ్లే -ఓ తెలంగాణా రైతు
ఈ రోజు తెలంగాణాలో మారుమూల పల్లె వెళ్లాను …
మెదక్ జిల్లా ఆందోల్ నియోజికవర్గం రేగొండ మండలం.. ఇటిక్యాల గ్రామం …
ఒక రైతు తో నా సంభాషణ ఇలా …
పెద్దాయనా ఎలా ఉంది వ్యవసాయం…
ఇది 40 ఎకరాల ఏక ముక్క.. పాటిల్ గారు మంచోడు .. కేవలం 7 వేలకే ఎకరం కవులుకి ఇచ్చాడు.. 3 బోర్లు ఉన్నాయి.. ఈ గడ్డ మీద కి వచ్చి 18 ఏళ్ళు అయ్యింది .. మొన్న కురిచిన వడగళ్ళ వాన వలన చేతికి వచ్చిన టమాటో పంట చేజారింది …
…. ఇలా అంటూ ఒక మాట అన్నాడు …


ఏమైనా వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఎల్లె …
పంట చేతికి సక్రమంగా వచ్చింది .. వానలు సమయానికి పడ్డాయి. రెట్లు కూడా వచ్చినాయి …
ఇస్తా అన్న కరంట్ ఇచ్చాడు.. చెప్పకపోయినా రుణమాఫీ చేసాడు …
మా రాజయ్య బతికి ఉంటె ఈ రాష్ట్రం విడిపోయేది కాదు… ఒకవేళ కలసి ఉన్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు …
మా రాజయ్యని చంపేశారు .. అందరూ కలసి చంపేశారు.. అది మాత్రం ప్రమాదం కాదు … అది ముమ్మాటికి హత్యే .. అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు …
నాకైతే రాజన్న జన్మ ధన్యం అయ్యింది .. ఇలాంటి అభిమానులని ఊరికి కనీసం ఒకరిని సంపాదిన్చుకున్నావ్ …. ఇక ఏడకి పోతావ్ రాజన్న… అనిపించింది …

నాతొ తోడుగా తెలంగాణా ఉద్యమ వీరులు కూడా ఉన్నారు …]