వెంకీకి హ్యాండ్ ఇచ్చిన రవితేజ..!

18 Apr 2015

కొత్త తరంలో మల్టీ స్టారర్ సినిమాలకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చిన పెద్ద హీరో విక్టరీ వెంకటేష్. మహేష్ తోనూ, పవన్ కళ్యాణ్ తోనూ కలిసి నటించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. వారితోనే ఆగిపోకుండా చిన్నా, పెద్ద అందరు స్టార్స్ తో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా వస్తున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నాడు.

ఆ క్రమంలోనే తాజాగా వెంకటేష్, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి ఒక సినిమా చేయబోతున్నారని ఒక వార్త బయటకు వచ్చింది. తమిళంలో వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న 'జిల్లా' సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న దర్శకుడు వీరు పొట్ల హీరోలుగా వారిని ఎంచుకున్నారు. ఇద్దరు హీరోలు కూడా చేయాలనే అనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ అనుకుంటున్న సమయంలో రవితేజ హ్యాండ్ ఇచ్చాడు.

తమిళంలో విజయ్, మోహన్ లాల్ చేసిన పాత్రలకు మేము సూట్ కాము.. అయినా మాతో ఒక యాక్షన్ సినిమా కాదు.. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రయత్నించు చాలా బాగుంటుంది అని సలహా ఇచ్చాడంటా.. రవితేజ దర్శకుడు వీరు పోట్లకు..! దాంతో వీరు ఆ పనిలో పడ్డాడు. 'జిల్లా' రీమేక్ హక్కులు చేతిలో ఉన్నవాళ్లు.. చేసేది లేక.. సినిమాను డబ్ చేసి తెలుగులో విడుదల చేసే సన్నాహాలు మొదలు పెట్టారు.