ఇక బూతు ఎంటర్ టైన్మెంట్..!

13 Apr 2015

సినిమా రకరకాలుగా  ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. అందులో సెక్స్ అనే ఫీలింగ్ కు భాగం ఉంది. భారతదేశంలోని  అన్ని బాషల్లోను ఎందరో శృంగార తారలు.. ప్రేక్షకులను ఆనందపరిచారు. ఇప్పుడు కూడా చాలా మంది ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ బాగానే డబ్బులు వెనకేసుకుంటున్నారు. అలానే శృంగారభరిత సినిమాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంది. కాని ఆ సినిమాలకు సంబంధించి ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని బద్దలు కొట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది.
 
ఆ ప్రయత్నానికి స్పూర్తి గత సంవత్సరం జనాల మధ్యకు వచ్చి 100 కోట్లు వసూలు చేసుకుని వెళ్ళిన బాలీవుడ్ అడల్ట్ సినిమా 'గ్రాండ్ మస్తి'. ఆ సినిమా 100 కోట్లు వసూలు చేయటం సెక్స్  సినిమాలు చెయ్యాలని ఉబలాటపడే ఫిల్మ్ మేకర్స్ కు బోల్డంత ఉత్సాహాన్ని.. ఆశను కలిగించింది. ఫలితమే.. ఏక్తా కపూర్ నిర్మించ తలపెట్టిన 'XXX'. ఈ సినిమాలో ఉత్తుత్తి సీన్స్ కాకుండా... హాలీవుడ్ తరహాలో న్యూడిటి కూడా పొంగిపోర్లించాలని  ఏక్తా కపూర్  నిర్ణయించుకుందటా..!
 
ఈ సినిమాలో నటించేందుకు అందరు కొత్త వాళ్ళనే... తీసుకుంటున్నారు.. అలానే న్యూడ్ సన్నివేశాల్లో నటించాలి అన్న నిబంధనను పెట్టి వారితో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం. పొతే ఏక్తా ఇంత ధైర్యంగా చేస్తున్న ఈ సినిమాకు ఆదరణకు సంబంధించి ఎటువంటి డోకా ఉండదు. కాని ఆంక్షలను దాటుకుని .. అంటే సెన్సార్.. ఆ సంఘాలు.. ఈ సంఘాలు.. విటన్నిటిని దాటుకుని సినిమాను ఎలా బయటకు తీసుకువస్తుందో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను ఆమె సక్సెస్ ఫుల్ గా బయటకు తెచ్చిందో..  ఇక బూతు ఎంటర్ టైన్మెంట్  కు లాకులు ఎత్తేసినట్టే..!