తాప్సిని బెదరగొట్టిన లారెన్స్!

21 Apr 2015

మనకు రిలీజ్ కాలేదు కాని.. తమిళంలో విడుదలై మంచి టాక్ దక్కించుకుని.. సూపర్ గా కలక్షన్లు దున్నేస్తుంది.. లారెన్స్ కొత్త సినిమా కాంచన 2(తెలుగులో గంగ). ఆ సినిమాలో తాప్సి హీరోయిన్. సాదారణంగా లారెన్స్ సినిమా అంటే.. పేరు మొత్తం గుత్తంగా లారెన్స్ మాస్టర్ కే వెళ్ళిపోతుంది. కాని ఈ కాంచన 2 లో తాప్సి నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి.
 
అందుకు కారణం లారెన్సే అంటుంది తాప్సి. మొదట ఈ సినిమాకు సంబంధించి లారెన్స్ తాప్సిని సంప్రదించినప్పుడు భయపడిపోయిందంటా..! ఎందుకంటే.. లారెన్స్ మాస్టర్ తన కధతోనే తాప్సిని బెదరగొట్టాడంటా..! సినిమా చేస్తానో.. చేయనో.. చెప్పటానికి టైం అడిగితే.. లారెన్స్ నెల టైం ఇచ్చారంటా..! నెల తరవాత ఫోన్ చేసి ఏమి అలోచించావ్ అంటే.. తెలియదు అని సమాధానం చెప్పిందంటా..! అప్పుడు లారెన్స్ మాస్టర్ నో వర్రిస్.. నన్ను నమ్ము సినిమా విడుదల తరవాత చూడు అని చెప్పి సినిమా చేయించాడంటా..!
 
ఇప్పుడు సినిమా విడుదల అయ్యి.. అందరు సినిమా బాగుంది.. తాప్సి బాగా చేసింది అంటుంటే... ఎంతో సంతోషంగా ఉంది. పొతే ఇందులో నా గొప్ప ఏమిలేదు... అంత లారెన్స్ మాస్టర్ కష్టమే.. ఆయనకే క్రెడిట్ దక్కాలి అని అంటుంది. అది కధ మొత్తానికి మొదట్లో బెదిరిన.. ఇప్పుడు అవసరమైన విజయాన్ని అందుకుని హ్యాపీగా ఉంది తాప్సి.