నిర్మాతగా మరో హీరోయిన్..! 

25 Apr 2015

ఎక్కడ సంపాయించుకుంది.. అక్కడే పోగొట్టుకుంటారు.. ఎక్కడ పోగొట్టుకుంది.. అక్కడే.. సంపాయించుకుంటారు.. అని పెద్దలు చెప్పారు.. మనం విన్నాం. ఈ మాట సినిమాలలో పనిచేసే వాళ్ళకు కూడా నప్పుతుంది. ఎందుకంటే.. సినిమాలలో సంపాయించిన డబ్బుని సినిమాలు తీయటానికి ఖర్చు పెట్టి.. పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.. రెండింతలు మూడింతలు సంపాయించుకున్న వాళ్ళు ఉన్నారు.
పలానా వాళ్ళే.. నిర్మాతగా మారాలి అని రూల్ ఏమి లేదు.. సినిమాతో సంబంధం ఉన్న వాళ్ళు చాలా మంది  నిర్మాతలుగా మారిన సందర్బాలు చాలా ఉన్నాయి. కాని వాళ్ళలో హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు తాప్సి కూడా నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. పొతే సినిమాలు లేవని నిర్మాతగా మారటం కాదు.. తన సత్తా ఏమిటో చూపించిన సినిమాను చాలా మందికి చూపించాలి అని నిర్మాతగా మారుతుందంటా..!
ఈ మధ్య చేసిన సినిమాలు ఆడక.. అవకాశాలు సరిగా రాక.. నిరాశలో ఉన్న తాప్సికి కాంచన 2 విజయం మంచి ఊపును ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయటానికి సిద్దం అవుతుంది. సంజయ్ లీల బన్సాలితో కలిసి చేయటానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తీ వివరాలు త్వరలో తెలుస్తాయి.