టాలీవుడ్ లో తమన్నా మేనియా..!

26 Apr 2015

తెలుగు సినిమా పరిశ్రమలో తమన్నా పరిస్థితి మహా విచిత్రం..! హిట్ కొట్టిద్ది అనుకున్న సమయంలో సూపర్ ప్లాప్ లు ఇవ్వటం.. ! ఈ సినిమాను పట్టించుకోనవసరం లేదు అన్నప్పుడు.. సూపర్ హిట్ లు ఇవ్వటం.. తమ్ముకే చెల్లింది. తమన్నాకు ఇక్కడ సినిమాలు లేవు ఇక తమిళ్ నాడు వెళ్ళిపోయింది అనుకున్నారు ఒకసారి .. ఇంకోసారి బాలీవుడ్ వెళ్ళిపోయింది అనుకున్నారు..  కాని ఇప్పుడు చూస్తే.. టాలీవుడ్ నే గట్టిగా అతుక్కు పెట్టుకుని ఉన్నట్టు అనిపిస్తుంది.
టాలీవుడ్ లో ఒకసారి గోల్డెన్ లెగ్.. మరోసారి ఐరన్ లెగ్ అనిపించుకున్న ఘనత తమన్నా పేరుమీదే ఉంది. ప్లాపుల్లో ఉన్న నాగచైతన్యకు 100% లవ్ తో బ్రేక్ ఇచ్చింది తమ్మునే.. అలానే రచ్చ సినిమాతో రామ్ చరణ్ ను మాస్ జనాలకు అంకితం అయ్యేట్టు చేసిన అదృష్టం తమన్నానే..! పొతే ఈ ఇద్దరు హీరోలతో కాకుండా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ సహా పలువురు పేద స్టార్స్ తో వరస పరాజయాలు దక్కించుకుని ఐరన్ లెగ్ అనిపించుకుంది కూడా తమన్నానే..!
ఇన్ని ట్విస్ట్లు ఉన్న తమన్నాను నమ్మటంలో ఎక్కడ వెనకడుగు వేయటం లేదు తెలుగు సినిమా పరిశ్రమ. అందుకు నిదర్శనం ఇప్పుడు ఆమె మహా బిజీగా తెలుగు సినిమాలు చేస్తూ ఉండటమే..! ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి. బాహుబలి, నాగార్జున , కార్తి కలిసి చేస్తున్న సినిమా, రవితేజ బెంగాల్ టైగర్, నాగచైతన్య కొత్త సినిమా.. తో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్టు సమాచారం. చూడాలి మరీ తమన్నా హవా ఇంకెన్నాళ్ళు చలామణి అవుతుందో..?