తమన్నా ప్రేమ కధ..!

9 Apr 2015

తమన్నా ప్రేమకధ.. అనగానే ఏ సినిమాలో ప్రేమకధ? ... కొత్త సినిమానా?.. ఎవరు హీరో?.. అని మీరు అడిగేయవచ్చు. కాని హీరోయిన్లు కూడా మనుషులే కదండీ.. ఎప్పుడూ సినిమా ప్రేమలేనా? నిజమైన ప్రేమలు ఉండవా? వాళ్ళు ప్రేమించారా? సినిమాకి ఒక హీరోని ప్రేమించినట్టు నటిస్తారు.. కాని వారి లైఫ్ మొత్తానికి ఒక హీరో ఉంటాడు.. వాడు తగిలినప్పుడు .. నటన ప్రేమకాదు.. నిజమైన ప్రేమ వచ్చేస్తుంది.. ఇప్పుడు తమన్నా అటువంటి ప్రేమలోనే మునిగి తేలుతున్నట్టు కబుర్లు అందుతున్నాయి.
 
పొతే ఈ విషయన్ని గుట్టుగా ఉంచాలనే తమన్నా నిర్ణయించుకుందంటా..! కాని నలుగురిలో తిరుగుతున్నప్పుడు నిజం ఆగుతుందా.. బయటకు వచ్చేయదు.. ప్రస్తుతం తమన్నా చేస్తున్న ఒక సినిమా హీరోతోనే అమ్మడు ప్రేమలో ఉందంటా! అతనికి తానూ చేసిన మొదటి సినిమా హీరోయిన్ తో కొన్నాళ్ళు ప్రేమవ్యవహారం నడిపిన అచ్చట, ఆ తరవాత వేరే హీరోయిన్ తో కొన్నాళ్ళు డేటింగ్ వ్యవహారం నడిపించిన ముచ్చట ఉన్నాయంటా..!
 
ఇప్పుడు అతనితోనే రిలేషన్ పెట్టుకున్న తమన్నాకు ఈ సంగతులు తెలుసో.. తెలియదో.. ఎవరికీ తెలియదంటా..! అలానే ఆ హీరో ఇంతకు ముందు అమ్మాయిలకులానే తమన్నాను వాడుకు వదిలేస్తాడో.. లేక జీవితభాగస్వామిని చేసుకుంటాడో.. చూడాలి అంటున్నారు పెద్దలు.