స్టార్ హీరో కుల పిచ్చి..!

3 Apr 2015

ఇండియాలో కులం, వర్గం అనే మాటలకూ ఎంత ప్రత్యేకత ఉంటుందో.. తెలియంది ఎవరికి..! కులం కార్డేసుకుని.. ఎన్నో సాదించేయ వచ్చు.. ఎక్కడిదాకో.. ఎదిగేయ వచ్చు..! కులం కార్డ్ కు తగ్గట్టు ప్రతిభ ఉంటే అదనపు అందలాలు ఎక్కటం చాలా సులువు..! ఈ రంగం అనిలేదు.. ప్రతి రంగంలోనూ కులం కీలకమైన పాత్ర పోషిస్తుంది. రాజకీయాలలో కులం మార్క్ బహిరంగంగా కనిపిస్తే.. సినిమా రంగంలో అది అంతర్లీనంగా ఉంటుంది.
 
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రదానంగా రెండు కులాలు డామినేషన్ ప్రదర్శిస్తూ ఉంటాయి. మిగిలిన కులాలు ఆ రెండు కులాల పెత్తనానీకే మడుగులు ఒత్తుతూ ఉంటాయి. ఈ వ్యవహారం చాలా ఏళ్లుగా నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండు కులాల పెత్తానానికి పులిస్టాప్ పెట్టాలి అని వేరే కులానికి చెందినా పెద్ద స్టార్ హీరో తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మిగత కులాలను కలుపుకుని ఏదో చెయ్యాలి అని అనుకోవటం కాదు. తన కులం వాళ్ళు కూడా పరిశ్రమ మీద పెత్తనం చెలయించాలి అన్నట్టు ఆయన పావులు కదుపుతున్నట్టు అనుకుంటున్నారు.
 
ఆ స్టార్ హీరో తండ్రి సోదరుడు ఒకప్పటి స్టార్ హీరో.. ఆయన వారసత్వమే ఈ హీరో అందుకున్నాడు. ఆ పెద్దాయన కులం గిలం పట్టించు కోకుండా.. మంచి నటుడు అనిపించుకున్నాడు. కాని ఈ కుర్ర హీరో తనకు ఏర్పడిన స్టార్ డమ్ ను ఉపయోగించుకుని తన కులం వాళ్ళు ఇండస్ట్రీలో స్థిరపడేలా అన్నిరకాల సహాయాలు అందిస్తున్నాడు. ఆ కులానికి చెందిన నటులకు అవకాశాలు ఇవ్వాలని దర్శకులకు, నిర్మాతలకు సూచించటం.. తన వర్గానికి చెందిన వాళ్ళకి ఎవరి నుండైన ఇబ్బందులు వస్తే.. ముందుండి మాట్లాడటం.. ఎవరినైనా నిలదీయటం వంటివి చేస్తున్నాడని తెలుస్తుంది. అలానే స్నేహితులను నిర్మాతలను చేయటం ఇలా చాల రకాలైన కార్యక్రమాలను చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్..! ఒక పధకం ప్రకారం తన కులానికి చెందిన వ్యక్తులకు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకత తీసుకువస్తున్న ఆ స్టార్ హీరో ముందు ముందు టాలీవుడ్ లో ఎటువంటి మార్పులకు కారణం అవుతాడో.. చూడాలి.