సినిమా వాళ్ళ దొంగ లెక్కలు అందుకేనటా..

26 Apr 2015

సినిమా విడుదల తరవాత మొదటి రోజు అన్ని కోట్లు వచ్చాయి.. మొదటి వారంతం ఇన్ని కోట్లు వచ్చాయి…. మొదటి వారం ఈ రికార్డ్ పగిలింది.. రెండో వారం ఆ రికార్డ్ దాటం అని డప్పులు కొట్టుకోవటం సాదారణంగా కనిపిస్తూ ఉంటుంది.. మన తెలుగు సినిమాలకు సంబంధించి..! పొతే ఈ లెక్కలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమాల వసూళ్ళకు సంబంధించి.. ఒక నిర్దిష్టమైన వ్యవస్థ అంటూ లేదు. ఎవరెవరో.. ఏవేవో లెక్కలు చెబుతారు.. వాటిని పెట్టుకునే అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. చివరికి నిర్మాతలు కూడా ఎలా లెక్కలు వేసుకుంటారు అనే విషయం పై ఎక్కడా స్పష్టత ఉండదు. లాభాలు వస్తే.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు లెక్క పెట్టుకుని లోపల దాచుకుంటారు. నష్టాలూ వస్తున్నాయి అనుకుంటే మాత్రం.. జనాలను మభ్యపెట్టటానికి ఏవో… కాకి లెక్కలు బయట పెడతారు.
లాభాలు వచ్చినప్పుడు ఓకే కాని.. నష్టాలు వచ్చినప్పుడు పరజయంలో బాగాన్ని ఇంకొంత మందికి పంచే ప్రయత్నాలు మొదలెట్టారు. అందుకోసం వాళ్ళు తొలిగా ఆడిపోసుకుంటుంది ఎవరిని అంటే.. రివ్యూలు వ్రాసే వాళ్ళను..! వాళ్ళు సినిమా బాగుంది అని వ్రాసినప్పుడు లాభాలు దండుకోవటం బాగానే ఉందట కాని…  సినిమా బాగాలేదు అని వ్రాసినప్పుడు లాభాలు దండుకోవటం కుదరటంలేదు అని గోల మొదలెట్టారు. మేము చచ్చి చెడి ప్రచారం అంటూ.. రికార్డ్ కలక్షన్లు అంటూ..  దొంగ లెక్కలు చూపెడుతూ వెధవ వేషాలు వేసేది ఎందుకు? జనాలను మోసం చేయటానికి.. కాని రివ్యూలు అందుకు అవకాశం ఇవ్వటంలేదు.. అని యాగి చేస్తున్నారు. ఇక్కడ అర్ధం కాని విషయం ఒకటి ఏమిటి అంటే..  నిర్మాతలది మాత్రమే డబ్బా..? జనాలు ఖర్చు పెట్టేది డబ్బుకదా..? వాళ్ళు ఖర్చుపెట్టే.. రూపాయికి.. సమయానికి న్యాయం జరగాల్సిన అవసరం లేదా..?