సింహం సింహమే, నక్క నక్కే.

22 Apr 2015

YS బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది. YS ముందు బాబు తేలిపోతాడు(2009 లో పాత్రికేయులు పాశం యాదగిరి) 2009 ఎన్నికలయ్యాక అప్పటి టీడీపీ నాయకురాలు రోజా వచ్చి వై‌ఎస్ ను కలిసింది. ఆ రోజు I-News దీనిమీద చర్చ పెట్టింది. ఆ చర్చ లో ప్రత్యేక తెలంగాణ వాది అయిన పాశం యాదగిరి అనే సీనియర్ విలేకరి ని అడిగారు ఐ-న్యూస్ వాళ్ళు బాబు కు వైయెస్ కు మధ్య గల తేడా ఏంటని.

ఆయన మాటల్లో” వై‌ఎస్ ముందు బాబు తేలిపోతాడు, బాబు కారెక్టర్ చాలా వీక్. ఇద్దరు కూడా రాయలసీమ వాసులే కాబట్టి రాయలసీమ లో వాడుకలో ఉన్న సామెత తో పోల్చుతాను అని "వైయెస్ బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది" అన్నాడు.

YS పాలన చాలా బాగుంది నాయనా అని బాబు తో చెప్పిన బాబు సొంత చిన్నాన్న( ఆంధ్రజ్యోతి ,March,2009,నారావారిపల్లె).ఒక విగ్గు హీరో మర్డర్ కేసులో ఇరుక్కొంటే అతని కులస్తులంతా వెళ్లి మావాడు ఏదో ఆవేశం లో చేసాడు, క్షమించండి అంటే శత్రువు, లేదా వేరే కులం వాడు అని చూడకుండా క్షమించిన రాచగునమున్న వాడు రాజశేఖరుడు.రాయలసీమ లో శత్రువు అయినా ఇంటికొస్తే క్షమిస్తారు.కానీ పులి పోయాక, విశ్వాసం లేని నక్కలు, తోడేళ్ళు పులి బిడ్డను ను వెంటాడి వేదిస్తున్నాయి.