మంత్రులను కంగారు పెడుతున్న శృతి హసన్!

12 Apr 2015

కమల్ హసన్ గారి కూతురు శ్రుతీ హసన్ ఈ మధ్య తిరుపతి వెళ్ళింది. తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకుని ఆనందపడింది. కాని వెళ్ళే మార్గంలో ఒక చేదు అనుభవం కారణంగా ఆమె చాలా భాదపడింది. ఆ అనుభవం కారణంగా భాదపడినా.. కొంచెం సేపటికి సద్దుకుంది. కాని ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టిన అంశమే ఆంధ్రప్రదేశ్ మంత్రులను కంగారు పెడుతుంది.
 
విషయంలోకి వెళితే..  శృతి శ్రీవారిని.. అంటే వెంక్కన్న స్వామిని దర్శించుకోవటానికి తిరుమల వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కిందంటా .. ప్రయాణం మధ్యలో ఓ పెద్దాయనా పెద్దగా అరుస్తూ.. మాట్లాడుతున్నాడంటా.. ఇబ్బందిగా ఉంది చిన్నగా మాట్లాడండి అని రిక్వెస్ట్ చేసిందంటా శృతి.. దాంతో కోపం తెచ్చేసుకున్న సదరు పెద్దాయన శృతి మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడని.. ఆయన ప్రతాపానికి శృతి వెక్కి వెక్కి ఎడ్చిందని సమాచారం. శృతిని ఓదార్చటానికి ఎయిర్ హోస్టెస్ చాలా కష్టపడాల్సి వచ్చిందంటా..! పొతే శృతిని అన్నేసి మాటలు అన్న పెద్దాయన ఎవరు అని ఆరా తీస్తే.. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ అని తేలింది.
 
ఆ సంఘటనలో ఉన్న అసలైన విషయాన్ని గ్రహించి శృతి సముదాయించుకుని దాని గురించి బయట పెట్టకుండానే వెళ్ళిపోయింది. కాని మిగతావాళ్ళకి ఊసుపోవద్దు... అందుకని ఎవరా మంత్రివర్యుడు అని ఆరాలు తీసి.. మొత్తానికి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేరు బయటకు తెచ్చారు. అంతే.. మీడియాకు నిప్పు దొరికింది.. మేటర్ గుప్పు మంది. అర్ధం పర్ధం లేకుండా జరుగుతున్న ప్రచారాన్ని తొందరగానే ఖండించారు మంత్రిగారు. ఈ సంఘటనకు, తనకు ఎటువంటి సంబంధం లేదు అని తేల్చేశారు. అందుకు కొన్ని సాక్షాలు కూడా చెప్పారు.  దాంతో.. ఆయన కాకపోతే మరెవరు అనే ప్రశ్న మొదలైంది.. ఇప్పుడు క్యాబినెట్ లోని మరెవరి పేరు బయటకు వస్తుందో .. అని మంత్రులందరూ కంగారు పడుతున్నారని ఒక కధనం. అది సంగతి శృతి హసన్ అలా మన మంత్రులను కంగారు పెడుతుంది. చూడాలి మరి ఈ మేటర్ ఇక్కడితోనే ఆగిపోతుందో.. మరో మంత్రి పేరు బయటకు వస్తుందో..?