సెక్స్ తార సూపర్ స్టార్ అయ్యింది..!

16 Apr 2015

సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోలకు ఒక గొప్ప ఉంటుంది. సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే.. ఆ కాసులను దాచుకోవటానికి ఓ మాదిరి పెట్టేలు సరిపోవు..! అలాకాకుండా ఫెయిల్ అయితే పెట్టుబడి వరకైనా వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. అది స్టార్ డమ్..! ఈ స్టార్ డమ్ ఎవరికీ పడితే వాళ్ళకు ఊరకనే వచ్చేయదు.. దాని వెనుక ఎన్నో లెక్కలు.. బోల్డంత కృషి ఉంటుంది. ఇండియాలో ఉన్న పరిస్థితుల ప్రకారం సాదారణంగా హీరోలే సూపర్ స్టార్ అనిపించుకుంటూ ఉంటారు.. కాని ఒక సెక్స్ తార ఇప్పటివరకు ఉన్న సూపర్ స్టారిజనికి కొత్త అర్ధాలు చెప్పటం మొదలుపెట్టింది.
 
ఆవిడ ఎవరో కాదు లేటెస్ట్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్..! ఎంత పెద్ద స్టార్ హీరో అయినా...  చేసిన సినిమాలో విషయం లేకపోతే.. డిజాస్టర్ ముద్రేపించుకుని.. నష్టాలూ మూట కట్టుకోవాల్సిందే..! కాని సన్నీ పరిస్థితి అలా లేదు..! సినిమా కంటెంట్ తో అసలు సంబంధం లేదు.. తెరమీద సన్నీ ఉంటే చాలు కనకాభిషేకం..! గత శుక్రవారం సన్నీ నటించిన ఎక్ పహేలి లీల సినిమా విడుదలైంది. ఆ సినిమా బాగుందన్న మహానుబావుడు ఒక్కడు లేడు.. చాలా మంది ఇదసలు సినిమానా  అని చీదరించుకుంటూ.. 0 రేటింగ్స్ వేశారు. కాని ఇవేవి సన్నీ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి.
 
సినిమా విడుదల తరవాత మొదటి మూడు రోజుల్లో రోజుకు 5 కోట్లు చప్పున 15 కోట్లు వసూళ్ళు రాబట్టి పెద్ద పెద్ద హీరోలే అదిరిపోయేట్టు చేసింది సన్నీ..! ఎన్నో కష్టాలకు ఓర్చి.. ఎంతో సృజనాత్మకత జోడించి రూపొందించిన డిటెక్టివ్ బోయంకేష్ బక్షీ లాంటి సినిమా నెగిటివ్ టాక్ తో మొదటి వారంలో 10 కోట్లు రాబట్టుకోవటానికి వణికి పోయింది. అంతెందుకు s/o సత్యమూర్తి సినిమా మొదటి రోజు 9 కోట్లు వసూలు చేస్తే.. తరవాతి రోజు నుండి 4 కోట్లు అంతకంటే తక్కువ కలెక్ట్ చేస్తూ పోతుంది. సన్నీ మాత్రం మొదటి 3 రోజుల్లోనే నిర్మాతకు, డిస్త్రిబ్యుటర్స్ కు లాభాలు తెచ్చి పెట్టేసింది. ఇంకా మంచిగానే నడుస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరిలోకి సన్నీ టాప్ అనిచెప్పటం కరెక్ట్ అనిపించుకుంటుందా? లేదా?