సినిమాల పై శేషాచలం ఎన్ కౌంటర్ ఎఫెక్ట్..?

12 Apr 2015

 
తిరుపతి శేషాచలం అడవుల్లో గతవారం జరిగిన ఎర్ర చందనం స్మగ్లర్స్ ఎన్ కౌంటర్ ప్రభావం తెలుగు సినిమాల పై పడుతుంది. ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా కొన్ని తమిళ సంఘాలు తమిళనాడులో తెలుగు వారి పై దాడులు దిగుతున్నాయి. అలానే తెలుగు సినిమాలు చేస్తున్న వారి పై దూషణలకు దిగుతున్నారు. తెలుగు సినిమాలు ఆడుతున్న దియేటర్ల పై దాడులకు పాల్పడుతున్నారు.
 
ఏప్రిల్ 9 న హైదరాబాద్ లో జరిగిన బాలకృష్ణ లయన్ ఆడియో వేడుకలో సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిష పాల్గొంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈ సంగతినే తప్పుపడుతూ ఒక తమిళ సంఘం త్రిషకు హెచ్చరికలు జారి చేసింది. తమిళుల పై కఠినంగా వ్యవహరించిన చంద్రబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంటావా..! నీకు అభిమానం లేదా? ఈ విషయానికి సంబంధించి ముందు ముందు విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని త్రిష గురించి ఆ సంఘం వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.
 
ఇక్కడి వరకే కాదు.. తమిళనాడు లోని కంచిపురంలో S /O సత్యమూర్తి సినిమా ఆడుతున్న దియేటర్ పై కూడా కొంతమది దాడి చేసి దియేటర్ బయట హుంగామా చేశారని సమాచారం. పొతే ఈ పరిణామాలను సినిమా పెద్దలు ఆరోగ్యకరంగా భావించటంలేదు. రాజకీయాలను సినిమాలతో ముడి పెట్టటం మంచి పద్దతి కాదు అని వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని.. ఈ మాటలను వినేదెవరు చెప్పండి..?