త్రివిక్రమ్ మీద కొత్త నింద..!

29 Apr 2015

సినిమా వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా కొత్త కొత్త న్యూస్ బయటకు వదులుతూ ఉండాలి. లేదంటే.. న్యూస్ రాసే వాళ్ళకు ఊసుపోక బొక్కలు వెతికే పని మొదలుపెడతారు. ఆ బొక్కలు ఎంత పెద్ద పేరున్న స్టార్ కైనా లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడతాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ కు అలాంటి తలనొప్పే ఒకటి వచ్చింది.
 అదేమంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హీరోయిన్ పాత్రలంటే.. చిన్న చూపు ఎందుకు అని..! ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు చూడండి.. ప్రతి సినిమాలోనూ హీరోయిన్ కు ఏదో ఒక లోపం పెడతాడు. అమాయకూరాలో.. ఐరన్ లెగ్గో.. షుగర్ ఉందనో.. దెబ్బ తగిలి మతి పొయిందనో.. తింగరిగా కనిపించే విధంగానే ఎక్కువగా పాత్రలు క్రియేట్ చేస్తాడు.. ఎందుకంత ఆడాళ్ళ మీద అక్కసు ఆయనకు అని ఒక  సమస్య లేవనెత్తి చర్చ మొదలు పెట్టారు కొంతమంది.. !
ఈ సంగతి విని..  లోపాలను హీరోయిన్స్ కు పెట్టటం అంటే.. అటువంటి లోపాలు ఉన్నవాళ్ళకు ధైర్యం ఇవ్వటమే.. ఈ మాత్రం కూడా బుర్ర లేకుండా సినిమాల గురించి మాట్లాడే వాళ్ళు ఉండబట్టే.. తెలుగు సినిమాలు ఇలా తగలడ్డాయి అని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మరీ ఈ సంగతి గురించి త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.