సమంతా కొత్త లవ్..!

16 Apr 2015

ఆ మధ్య 'నేను ప్రేమలో ఉన్నాను.. కాని ఆ హీరో ఎవరో చెప్పను' అని చెప్పి అందరిలో ఆశ్చర్యంతో కూడిన ఆసక్తికి కారణం అయ్యింది. ఆ పై కొన్ని చిన్నపాటి ఎంక్వయిరీలతోనే సమంతా, సిద్దార్థ్ ప్రేమలో ఉన్నారని అర్ధం అయ్యింది. వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తూ.. గాసిప్స్ రాసుకునే వాళ్ళకు బోల్డంత స్టఫ్ ఇచ్చారు. తరవాత పరిస్థితులు ప్రకోపించాయో.. కాలం కన్నెర్ర చేసిందో..  పెళ్లి వరకు వెళ్తుందనుకున్న సమంతా, సిద్దార్థ్ ప్రేమ  పెటాకులయింది.
 
త్వరగా పెళ్ళిచేసుకుందాం అన్న.. సిద్దు ప్రపోజల్ కు.. 5,6 సంవత్సరాల పాటు పెళ్లి వద్దు అని సమంతా చేసిన ప్రపోజ్ కు సరిపడకే.. ఈ బ్రేక్ అప్ అయ్యిందని తమిళ పత్రికలు కోడైకుసాయి..! సంప్రదాయ బద్దంగా జరిగిన బ్రేక్ అప్ కావటంతో వారి మధ్య పెద్ద గొడవలు లేవని వినికిడి. పొతే పెళ్లైతే వద్దనుకుంది కాని.. ప్రేమ మాత్రం కావాలనే.. అనుకుంటుందంటా.. సమంతా..! అందుకని పెళ్లి అని గోల పెడుతున్న సిద్దును వదిలించుకున్నాక.. ప్రేమ మాత్రమే ఉండేలా ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ ను సమంతా ఎంచుకున్నట్టు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఈ మధ్య ఓ తమిళ బిజినెస్ మాన్ తో చెట్టా పట్టాలేసుకుని.. తిరుగుతుందటా సమంతా..! ఏమిటా.. సంగతని వివరాలలోకి వెళ్తే.. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసిందని ఒక తమిళ పత్రిక కధనాన్ని ప్రచురించింది. ఇదే విషయాన్ని ఒక ప్రెస్ మీట్ లో సమంతాను అడిగితే.. నవ్వి.. అలాంటిదేమీ లేదు అని రొటీన్ సమాధానం చెప్పిందంటా..! ఆమె చెప్పిన విధానాన్ని బట్టి...  ఎటు ఆడవారి మాటలకు అర్ధాలే వేరు కాబట్టి.. సమంతా కొత్త ప్రేమలో పడ్డట్టే అనుకుంటున్నారు.