హీరోల భజన చేస్తున్న సమంతా..!

29 Apr 2015సమంతా అందగత్తే కాదు.. మహా తెలివైన పిల్లా కూడా..! ఆమె తెలివి తేటల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. సక్సెస్ వచ్చినప్పుడు అదృష్ట దేవత కుమార్తెను అంటుంది. పరాజయం వస్తే.. లైఫ్ లో అన్నిటికి అవకాశం ఉంటుంది.. లైట్ అంటుంది. నచ్చకపోతే ఎంత పెద్ద హీరోనైన పరోక్షంగా మాటలనేస్తుంది.. తరవాత వారిని కాదు అన్ ఐ సమర్దించుకుంటుంది..!
హీరోయిన్ లకు కొరత ఉంది.. అందులో అందంగాను.. కొంచెం అణుకువగాను మెలిగే.. అమ్మాయిలు తక్కువైపోయారు… సమంతా మాటలను పట్టించుకోకుండా.. పని కానించుకుంటున్నారు.. నిర్మాతలు.. హీరోలు.. దర్శకులు. ఈ విషయాన్ని చక్కగా అర్ధం చేసుకున్న సమంతా హీరోలను డైరెక్ట్ గా ములగ చెట్టులు ఎక్కిస్తూ.. ఇన్ డైరెక్ట్ గా ఓ ఆట ఆడుకుంటుంది.
ఈ ప్రాసెస్ లోనే.. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలుగు తమిళంలో ఉన్న సూపర్ స్టార్ హీరోలందరినీ ఒకటే పెట్టున తెగ పొగిడి అవతల పారేసింది. ఎన్టీఆర్ డాన్సులు బాగుంటాయని, మహేష్  బాగుంటుందని.. తమిళ హీరో విజయ్ బాగా నవ్విస్తాడని.. సూర్యకు సిగ్గు ఎక్కువని.. విక్రమ్ డార్లింగ్ అని తెగ పోగిడేసింది. అందరిలోకి ఎక్కువగా విక్రమ్ కే ఎక్కువ పొగడ్తలు పడ్డాయి. ఎందుకంటే సమంతా ఇప్పుడు విక్రమ్ తో సినిమా చేస్తుందిలే..!