రానా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి కజ్జా..!

4 Apr 2015

బాహుబలి విలన్ రానా బాబు జిగిరి గర్ల్ ఫ్రెండ్ త్రిష కు పెళ్లి సెట్ అయిన సంగతి మనకు తెలిసిందే..! తమిళనాడుకు చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త కమ్ సినిమా నిర్మాత వరుణ్ ను త్రిష పెళ్ళాడాబోతున్న సంగతి ప్రపంచానికి పరిచయమే..! ఈ పెళ్లి ఓకే అయ్యే వరకు రానాబాబు సహా కొంతమంది సన్నిహితులతో యమా క్లోజ్ గా టైం గడిపిన త్రిష ఇప్పుడు ఉత్తమ ఇల్లాలు పాత్రలో ఏదో ఒక పెద్ద అవార్డు కొట్టే ప్రయత్నాలు చేస్తుంది అని చెన్నై మీడియా కోడై కుస్తుంది.
 
ఇంతకీ మేటర్ ఏమిటి అంటే.. త్రిషకు కాబోయే శ్రీవారు మొన్నమొన్నటి వరకు మంచి ప్లే బాయ్ అంటా..! చాలా గుట్టు చాటు వ్యవహారాలను నడిపించిన ఘనత అతని పేరున ఉందంటా..! ఈ విషయం ఇప్పుడు ఎవరి ద్వారానో తెలుసుకున్న త్రిష వరుణ్ మీద కస్సు బుస్సులాడుతూ.. పెళ్లి కజ్జాలు పెట్టుకోవటానికి సిద్దం అయ్యిందంటా..! కాని అమ్మడి శ్రేయస్సు కోరే కొంతమంది త్రిషను శాంతింపజేసి అతణ్ణి ఎత్తి చూపుతున్నావ్.. ముందు నీ నలుపు చూసుకో.. నీ వ్యవహారం తెలియంది ఎవరికీ.. నువ్వు తాగి తందనాలు ఆడిన సందడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇలాంటి విషయలను అతనూ మాట్లాడటం మొదలు పెడితే.. నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్..! అనవసరమైన రాద్దాంతం చేయకా.. మిన్నకుండు అని హిత భోద చేశారంటా..!
 
దాంతో చల్లబడ్డ త్రిష వరుణ్ తో గిల్లికజ్జాలు పెట్టుకునే కార్యక్రమాన్ని పక్కన పెట్టి.. పెళ్లి విశేషాల గురించి ఆలోచించటం మొదలు పెట్టింది అని.. తమిళ మీడియా గుసగుసలాడుతుంది. పెళ్లి తరవాత కూడా సినిమాలు చేయటం ఆపాను అను చెబుతున్న త్రిష ప్రస్తుతం బాలకృష్ణ పక్కన లయన్ సినిమాలో నటిస్తుంది.