రామ్ చరణ్ మీద దుష్ప్రచారం ?

20 Apr 2015

నిన్న విడుదల అయిన " ఒకే బంగారం" సినిమా సూపర్ హిట్ అవ్వడం తో అదే అదనుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో రాం చరణ్ ని టార్గెట్ చేస్తూ రచ్చ మొదలు అయ్యింది . ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ లని సరిగ్గా అంచనా వెయ్యలేడు అనే అపవాదు ఉన్న రాం చరణ్ పైన " ఒకే బంగారం లాంటి మంచి సినిమా కి నో చెప్పాడు, ఇప్పుడు బాధ పడుతున్నాడు " అంటూ ఎక్కడ లేని జాలి కురుపిస్తున్నారు . అయితే మనవద్దన ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాంచరణ్ కి వినిపించిన కధ పూర్తిగా వేరు . నాగార్జున - మహేష్ బాబులు అన్నాదమ్ములుగా పెట్టి ఒక స్క్రిప్ట్ అనుకున్న మణిరత్నం దాన్ని చరణ్ దగ్గరకి తీసుకుని వెళ్ళారు . ఈ మల్టీ స్టారర్ రామ్ చరణ్ కి నచ్చానే లేదు . బన్నీ తమ్ముడి పాత్ర కోసం ఒకే చెప్పినా కూడా చరణ్ ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసాడు . అదనమాట సంగతి రాం చరణ్ కి చెప్పిన కథ ఇదే కాదు నాయనలారా !