సమంతా మీద సెటైర్ వేసిన రకుల్!

18 Apr 2015

పైకి చెప్పుకోరు కాని అమ్మాయిలకు అసూయా కూడా ఒక ఆభరణమే.. ! మాములు అమ్మాయిలకే అసూయను కంట్రోల్ చేసుకోవటం అంత ఇజీ కాదు. ఇక హీరోయిన్స్ గురించి చెప్పాలా..? అలాంటి డ్రెస్ వేసుకుంది.. హెయిర్ స్టైల్.. నగలు.. ఒకటేమిటి.. ప్రతి విషయంలోనూ రకరకాల అసూయలు ఉంటాయి. కాకపోతే అన్ని వేళల అవి బయటపడవు... కొన్నిసార్లు మాత్రం కంట్రోల్ అవ్వవు...!

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా సమంతా పై తనకున్న అసూయను భలే చమత్కారంగా బయటపెట్టింది. ఈ మధ్య ఆమె తన సోషల్ పేజ్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ఏమంటే.. 'సమంతా రిబ్బన్ ను భలే అందంగా కట్ చేస్తుంది' అని! ఈ మాటలో అసూయా ఏముంది అనుకోవచ్చు. కాని బూతద్దం పట్టుకుంటే.. బోల్డన్ని అర్ధాలు వెతుక్కోవచ్చు.
రిబ్బన్ కట్ చేయటం అందంగా ఉండటం ఏమిటి...? సమంతా వరసగా సినిమాలు చేయటంలోనే కాదు.. రిబ్బన్స్ కట్ చేస్తూ.. షో రూమ్స్ ఓపెనింగ్ చేయటంలో కూడా మిగత వాళ్ళకు తక్కువ అవకశాలు ఇస్తూ.. మహా బిజీగా ఉంటుంది. సినిమాల సరే.. ఇలాంటి విషయాల్లోనైనా పక్కనోళ్ళకి అవకాశం ఇవ్వదా? అన్న పరమార్ధం కనిపించటంలేదూ..? పొతే ఈ కామెంట్ సంగతి సమంతాకు చేరిందో.. లేదో.. తెలియదు. చేరితే... సమంతా ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి.