రాజేంద్రప్రసాద్ గెలుపు కామెడీ..!

19 Apr 2015

అసవత్తరంగా సాగిన మా అద్యక్ష ఎన్నికలకు ఆసక్తి కరమైన ముగింపు దొరికింది. ఇక ఇక్కడితో మొన్నటివరకు జరిగిన ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం అనే వినూత్న కార్యక్రమానికి తెర పడింది అనుకున్నారు. కాని జనాలను ఆనందింపజేయటమే వృత్తిగా ఉన్న వాళ్ళు కాబట్టి.. ఈ దూషణల పర్వాన్ని మరి కొన్నాళ్ళు నడిపించి ప్రేక్షకులను అలరించే ఆలోచనలో ఉన్నట్టు కనపడుతుంది.
 
ఎల్లక్షన్ల ఫలితం తరవాత రాజేంద్ర ప్రసాద్ వర్గం.. చేసిన హడావిడి మాములుగా లేదు. ఓ నియోజకవర్గానికి MLA గెలిచినంత హంగామా చేశారు. ఆయన కూడా సూటి పోటి మాటలతో.. వ్యతిరేక వర్గాన్ని బాగానే పొడిచి పొడిచి పెట్టారు. ఇంటర్వ్యూ లో కూడా అప్పుడే ఏమి అయిపోలేదు.. ముందుంది క్రొకోడైల్ ఫెస్టివల్ అని సంకేతాలు ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ వర్గం ఎట్టిపరిస్థితుల్లో అవతలి వారి మీద అక్కసు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సీన్ అర్ధం అవుతుంది.
 
చివరికి జయసుధ స్పందిస్తూ కూడా రాజేంద్రప్రసాద్ మీద బోల్డన్ని కంప్లైంట్స్ చెప్పింది. ఫలితాల తరవాత రాజేంద్ర ప్రసాద్ వెకిలిగా మాట్లాడటం.. బాదించిందని.. ఆయన సినిమాల్లో కమెడియన్ కాబట్టి.. బయట కూడా జోకర్ వేషాలు వేస్తున్నాడు. నేను మా కార్యక్రమాల్లో పాల్గొనను అని ప్రకటించింది. ఆవిడనే కాదు రాజేంద్రప్రసాద్ చేస్తున్న కామెడీ వ్యతిరేక వర్గంలోని చాలా మందిని భాదపెడుతుందని తెలుస్తుంది. మరీ ఆయన ఈ విద్వేషాలు మాని ఎప్పటికైనా చల్లబడతారో.. లేక అలానే ఉంటూ అవతలి వాళ్ళను వేదిస్తారో..  చూడాలి..!