వామ్మో.. జగన్ ఇంత స్పీడా..?

30 Apr 2015


దర్శకుడు పూరి జగన్నాథ్ ను అభినవ సినిమా మేకింగ్ మిషన్ అంటున్నారు తెలుగు సినిమా జనాలు.  సినిమాను అనుకున్న బడ్జెట్ ప్రకారం పక్కగా తీయటానికి నానా హ్యాండ్ పిట్స్ నాకుతున్న ఈ రోజుల్లో కేకు ముక్క తిన్నంత తేలికగా సినిమాలు తీసిపడేస్తున్నాడు పూరి.
ఎన్టీఆర్ తో టెంపర్ రూపంలో చాలా రోజుల తరవాత మంచి విజయాన్ని దక్కించుకున్న పూరి జగన్నాథ్.. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఏ బ్యాంకాక్ లోనో.. కొత్త రకం మసాజ్  ట్రై చేస్తూ.. ఉంటాడు అనుకుంటారు చాలా  మంది. ఇంకా టెంపర్ 100 రోజులు కూడా పూర్తవలేదు కాని చిత్రంగా .. ఈ గ్యాప్ లోనే.. ఒక సినిమా తీసి అవతల పడేశాడు. ఆ సినిమాను మార్చిలో మొదలు పెట్టాడు.. ఏప్రిల్ ఆఖరకు అయ్యే పోయింది. పెద్ద సినిమాలు ఉన్నాయి కాని లేకపోతే.. మే సినిమా పడిపోయేది.
ఇంతకీ ఆ సినిమా ఏది అంటే.. ఛార్మి హీరోగా, నిర్మాతగా డబుల్ రోల్ పోషిస్తూ పూరి దర్శకుడిగా రూపొందించిన ‘జ్యోతిలక్ష్మి’. బుధవారంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాను జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 25 రోజుల సింగిల్ షెడ్యూల్ తో సినిమాను పూర్తీ చేసి పూరి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక్కడవరకు గొప్పగానే ఉంది.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.