క్రిమినల్ ప్రొడ్యూసర్ కు వెలి..!

26 Apr 2015


మన చిత్తూరు  జిల్లా పోలీసులకు అధికారాలు ఇచ్చి రంగంలోకి వదిలారు..  వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి తీగ పట్టుకుని డొంకంత లాగి వదిలి పెడుతున్నారు. ఆ క్రమంలో కొన్ని అవశేషాలు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా బయట పడ్డాయి. ఈ విషయం పై మొదట్లో స్పందించకపోయినా  ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగారు సినిమా పెద్దలు..!
కె మస్తాన్ వలి, ఈ మధ్యే పాపులర్ అయిన ఈ పేరు మనకు పెద్దగా తెలిదులెండి..ఈయన ఎవరో.. ఈయన ఏమి చేశాడో అన్న సంగతి జనాలకు పెద్దగా తెలయదు.. కాని తెలుగు సినిమా నిర్మాతల సంఘానికి తెలుసు. సదరు వలి ఈ మధ్యే ఒక తెలుగు సినిమా తీశాడు. ఆ సినిమా పేరు ప్రేమ ప్రయాణం. ఈ సినిమా విడుదల అయ్యిందో.. లేదో అన్న విషయం మీద పెద్ద క్లారిటీ లేదు. కాని ఇప్పుడు ఆ సినిమా టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. ఒక వేళ ఆ సినిమా విడుదల అయ్యి ఉండకపోతే.. సూపర్ పబ్లిసిటీ..!
పొతే ఆ సినిమా.. దానిని నిర్మించిన మస్తాన్ వలి ఒక్కసారిగా పాపులర్ అవటానికి కారణం ఈ బాబుకు ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధాలు ఉండటమే..! సినిమా తీయటం మటుకే కాదు.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ నీటు అగ్రవాల్ తో సహజీవనం కూడా చేస్తున్నాడంటా వలి. ఈ మధ్య పోలీసులు ఈ నిర్మాతను అరెస్ట్ చేశారు. దాంతో చాలా పాపులారిటీ వచ్చేసింది. ఈ పాపులారిటీ తట్టుకోలేని నిర్మాతల సంఘం ఆయన్ని వారి సంఘం నుండి వెలి వేసింది.