ప్రెస్ తో బన్ని గొడవ!bunny birthday pics, stylish star alu arjun

10 Apr 2015

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అతని పుట్టిన రోజును పురస్కరించుకుని మర్చిపోలేని మంచి గిఫ్ట్ ఇచ్చాడు.. అతని PRO..! ఈ విషయాన్నీ బన్నినే స్వయంగా ప్రకటించటం విశేషం. ఇంతకీ బన్నికి అతను ఇచ్చిన.. గిఫ్ట్ ఏమిటి..? అది బన్నికి ఎలా సంతోషం కలిగించింది?  ఆ సంగతి సరే.. టైటిల్ ఏదో పెట్టి.. ఇప్పుడు ఈ నస ఏమిటి..? వంటి అనుమానాలకు ఒకటే వివరణ.. అదేమిటో.. ఇప్పుడు చూద్దాం..!
 
అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు ఒక ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. ప్రెస్ అంతా వచ్చింది.. కాని బన్ని రాలేదు..! రెండు గంటలపైన వేచిఉన్న మీడియా మిత్రులు.. అక్కడికి పిలిచిన PRO మీద కోపం ప్రదర్శిస్తూ.. ప్రెస్ మీట్ బాయ్ కాట్ చేసి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ వార్తగా రాశాడు. దాంతో అల్లు అర్జున్ PRO కు కోపం వచ్చి.. రాసిన అతనితో గొడవ పెట్టుకుని.. ఇష్టం వచ్చినట్టు తిట్టాడంటా..! దాంతో ఆ జర్నలిస్ట్ తెలంగాణా జర్నలిస్ట్ యునియన్ లో ఫిర్యాదు చేశాడు.
 
ఆ పై జర్నలిస్ట్ లందరూ ఏకం అయ్యి.. ఆ PRO మీద యుద్ధం ప్రకటించారు. PRO కూడా తగ్గకపోవటంతో పరిస్థితి నువ్వెంతా అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్ళింది. ఇంకా గొడవ ముదురుతుందనే సమయానికి సీన్ లోకి వచ్చిన త్రివిక్రమ్ బన్నికి హితబోధ చేశాడు. దాంతో బన్ని మీడియా మిత్రులకు తన PRO తరపున క్షమాపణ చెప్పి.. ఈ అనుభవం నాకు ఎప్పటికి మర్చిపోలేని గొప్ప పుట్టిన రోజు కానుక అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కధ..!