పిచ్చాసుపత్రి లో రైతులని పెడుతున్నారు

20 Apr 2015

అఖిలేష్ యాదవ్ సర్కారుకు రోజు ఎదో ఒక రకంగా వార్తల్లో సంచలనాలతో నిలవక పోతే నిద్ర పట్టాడు కాబోలు , ఆ మధ్య వరస అత్యాచారాలతో అరాచకాలతో దేశంలోనే ప్రత్యెక అర్హత ని పొందిన అఖిలేష్ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విషయం కారణం గా మనముందు ఉండు . రైతులు ఒక పక్క దారుణమైన పరిస్థితులలో ఇబ్బందులు పడుతుంటే , వర్షాలు లేక వారు విల విల లాడే పరిస్థితి ఉంటె ప్రభుత్వం వారు దానికి 'మానసిక సమస్య' అనే ముద్ర వారి నెత్తిమీద వేసి పిచ్చాసుపత్రిలో ప్రత్యెక వార్డు ని కూడా కేటాయించి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని నిర్ణయానికి వచ్చారు . పిచ్చాసుపత్రుల్లో రైతుల కోసం ప్రత్యెక వార్డులు తెరవాలనే వారి నిర్ణయం తో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది . ఇప్పటికే ఆగ్రా లో ప్రభుతం మానసిక వైద్య శాల లో స్పెషల్ వార్డుని తెరిచేశారు కూడా