పవన్ కళ్యాణ్ కూడా చేతులెత్తేశాడు..!

4 Apr 2015

కాలం కలిసి రాకపోతే.. పవర్ స్టార్ అయినా ఏమి చేయలేడు.. మెగా పవర్ స్టార్ అయినా ఏమిచేయలేడు..! ఆ విషయాన్ని మహా గ్రాండ్ గా మళ్లోక్కసారి రుజువు చేసింది సాయి ధరమ్ తేజ్ నటించిన 'రేయ్' సినిమా..! పవన్ కళ్యాణ్ పేరుతో కనీసానికి కనీసంగా గట్టున పడిపోవచ్చు అనుకున్న YVS చౌదరికి ఆ అదృష్టం కలిసొచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
 
వారం క్రితం విడుదలై దారుణమైన టాక్ ను సొంతం చేసుకున్న 'రేయ్' చిత్రానికి ఊపిరిపోసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి పవనిజం పాటను సినిమా ఆడుతున్న దియేటర్లలో ప్రదర్శించటం మొదలుపెట్టారు. ఆ పాటను చూసి కూడా ప్రేక్షకులు పెద్దగా స్పందించటంలేదు. పాట బాగానే ఉంది కాని.. దాని కోసం సినిమాను భరించటం అంటే.. ఆలోచించుకోవలసిన పరిస్థితి అని మొహమాటం లేకుండా మాట్లాడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో సేవ కార్యక్రమాలు చేయమనండి మారు మాట్లాడకుండా చేస్తాం.. అంతేకాని.. ఇలాంటి సినిమాలు చూడమంటే.. మాత్రం చాలా కష్టం అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
 
మొత్తంగా YVS చౌదరి ఆఖరి ప్రయత్నం కూడా ఫెయిల్ అయినట్టే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చేతులు ఎత్తేశాడు అంటే .. 'రేయ్' సినిమాను కాపాడటం ఎవరి తరం కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. రేయ్ సినిమా భారి నష్టాలను చూడటం ఖాయం అని నిర్దారణ అయిపోయినట్టే అనుకోవచ్చు.. చూడాలి మరీ ఈ పరిస్థితి నుండి.. చౌదరి ఎలా బయటపడతాడో..?