పవన్ కొత్త అవతారం ఎందుకో..!

26 Apr 2015

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిస్తే.. ఒక సన్ సేషన్.. చూస్తే.. ఒక సంచలనం.. కొత్తరకం డ్రెస్ వేస్తే.. పిచ్చి..  గమ్మత్తుగా డైలాగ్ చెబితే.. మెంటల్ మెంటల్ అంతే..! అలా పవన్ ఏది చేసిన ఉక్కిరిబికిరి అయిపోయే అభిమానులు ఇప్పుడు ఒక విషయంగా అనుమానంలో పడిపోయారు. దాని వల్ల పవన్ కు ఏమౌతుందో.. దానితో వాళ్ళు ఏమవాలో అర్ధం కాకా ఆలోచనలో పడ్డారు.
పవన్ కళ్యాణ్ పేరు వినపడగానే ఇప్పుడు అందరి మాటలు రూపు మీదకు.. గుబురుగా పెంచుకున్న గడ్డం మీదకు పోతున్నాయి. ఏమిటా అవతారం..? పవన్ కళ్యాణ్ ఎందుకల తయారయ్యాడు..? ఇందులో మర్మం ఏమిటి..? సినిమా కోసం ఇలా తయారయ్యడా? లేక రిలాక్స్ అవుతున్నడా..? అని ప్రశ్నలు పడ్డాయి. ఈ విషయానికి పవన్ వైపు నుండి ఎటువంటి సమాచారం లేదుకాని.. ఎవరిష్టానికి వాళ్ళు మాత్రం ఏవేవో.. విశ్లేషణలు చేసుకుంటున్నారు.
కొంతమంది.. గబ్బర్ సింగ్ 2 కోసమే .. ఈ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.. అంటుంటే.. మరి కొంతమందేమో..  సరదాకు చేస్తున్నాడు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కొంతమందేమో.. పవన్ గడ్డంతో.. సినిమాలో వద్దు.. ఎందుకంటే.. ఆయన గడ్డంతో కనిపించిన పంజా పెద్దగా ఆడలేదు. సెంటిమెంట్ గా అది వర్క్ అవలేదు కాబట్టి.. గబ్బర్ సింగ్ 2 లో పవన్ అలా కనిపించకుండా ఉండటమే.. బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు. అసలు ఇంతకీ పవన్ ప్లాన్ ఏమిటో.. చూడాలి మరీ..