పవన్ గబ్బర్ సింగ్ 2 కు మళ్లీ బ్రేక్..?

12 Apr 2015

'మానవీయ కోణం తో కూడిన అభివృద్దే 'జనసేన' ఆకాంక్ష! మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు.ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే  మటుకు  నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నాను. ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే  మటుకు  నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి  సిద్ధంగా వున్నాను.' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య చేసిన స్టేట్ మెంట్.
 
దీని ప్రకారం ఆయన ఒక పనిచేయాలని ఎదురు చూస్తున్నారు.. మరి ఆయనకు పైన చెప్పిన విషయంగా పనిచేసే అవకాశం వస్తుంది.. లేదు.. అన్నది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బాబుగారు చట్టాన్ని తీసుకోరాకపోతే.. ఇబ్బందిలేదు.. వెళ్లి గబ్బర్ సింగ్ 2 సినిమా చేసుకోవచ్చు. అలా కాకుండా భూసేఖరణ చట్టం తెస్తే.. పవన్ కళ్యాణ్ పోరాటం మొదలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మరికొన్నాళ్ళు  గబ్బర్ సింగ్ 2 అటక మీదే ఉండాల్సిన స్థితి. పెద్దల అంచనా ప్రకారం.. బాబుగారు భూసేఖరణ చట్టం ప్రయోగించక తప్పదు. పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్దం అవటమే మంచిది అని మాట్లాడుతున్నారు.
 
మరో పక్క గబ్బర్ సింగ్ 2 సినిమాను మే 4 నుండి మొదలుపెడుతున్నాం.. అని అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.. దర్శకుడు బాబి..! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే.. అనుమానాలు కలిగిస్తుంది. పవన్ గబ్బర్ సింగ్ 2 కు మళ్లీ బ్రేకులు పడ్డట్టే.. అని ఒక నిర్ణయానికి వచ్చేయవచ్చు.. అని విశ్లేషణలు సాగుతున్నాయి. చూడాలి మరి.. కాలం పవన్ కళ్యాణ్ ను ఎటువైపుకు నడిపిస్తుందో..?