ఓకే బంగారం కోసం ఆత్మహత్యలు..!

22 Apr 2015

పరిస్థితులు కలిసొస్తే.. ప్రతి సంగతి సినిమా ప్రచారానికి అలా నడిచోచ్చేస్తాయి.. ! అది నెగిటివ్ అయినా.. పాజిటివ్ అయినా..! ప్రస్తుతానికి పాజిటివ్ ప్రచారంతో కోలీవుడ్ బాక్స్ ఆఫీసు ను షేక్ చేస్తున్న మణిరత్నం గారి ఓకే కన్మణి (తెలుగులో ఓకే బంగారం)  చిత్రానికి ఆసక్తికరమైన నెగిటివ్ ప్రచారం కూడా తోడైంది.
 
మంగళవారం ఒక తమిళ పత్రిక ప్రచురించిన కధనం.. మొత్తం తమిళ సినిమా పరిశ్రమనే విస్మయానికి లోను చేసింది. ఎందుకంటే తమిళనాడు లో ఇద్దరు వ్యక్తులు.. ఓకే కన్మణి సినిమా చూడటానికి వారి పార్టనర్స్ ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయరంటా..! చోద్యం అనుకోవచ్చు.. కాని ఇది నిజం..!
 
తమిళనాడులో కోయంబత్తూర్ లో ఒక షాప్ లో సేల్స్ మాన్ గా పనిచేస్తున్న కుర్రాడు.. తన లవర్ ఓకే కన్మణి సినిమాకు రానంది అని మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. అలానే మరో సంఘటనలో ఒక గృహిణి షాపింగ్ కి వెళ్లి అటు నుండి ఒక కన్మణి సినిమాకు వెళ్దాం అని చెప్పి.. చిరవి నిమిషంలో తీసుకుని వెళ్లలేదని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సమాచారం. ఈ రెండు సంఘటనల్లోనూ కారణాలు వేరే కూడా ఉండొచ్చు.. కాని అనుకోకుండా ఓకే కన్మణి పేరు చేరిపోయి..అలాకూడా ప్రచారం  జరిగిపోతుంది.