నిత్యా మేనెన్ ను వణికించిన దర్శకుడు

29 Apr 2015

ఒక్క మాటతో రాఘవ లారెన్స్ ను మణిరత్నం కంటే.. గొప్ప దర్శకుణ్ణి చేసేసింది.. మలయాళ కుట్టి నిత్యా మేనెన్. మణిరత్నం దగ్గర పనిచేయటం చాలా సరదాగా అనిపించిందని చెప్పుకొచ్చిన ఈ పిల్లా.. రాఘవ దగ్గర పనిచేయటానికి మాత్రం చుక్కలు కనిపించాయని చెప్పుకొచ్చింది.
కాంచన 2 లో నటించిన నిత్యా మేనెన్ ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు తన అనుభవం గురించి చెబుతూ ఇలా స్పందించింది. సినిమా నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఎలా నటించాలి అని ఒక స్పష్టత రాలేదు. సెట్స్ కు వెళ్ళాక లారెన్స్ చెప్పినట్టు నటించే ప్రయత్నం చేసే.. కఠినమైన సన్నివేశాలు పెట్టి.. నన్ను నన్ను వణికించేశాడు. ఈ అనుభవాన్ని నేను ఇప్పటికి మర్చిపోలేను. పొతే ఇలాంటి పాత్రలు చేయటమే నిజమైన చాలెంజ్.. లారెన్స్ నుండి చాలా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది.
రెండువారాల క్రితం తమిళంలో విడుదలైన కాంచన 2 తమిళ  బాక్స్ ఆఫీసు ను షేక్ చేస్తుంది. ఇప్పటికే సినిమా 40 కోట్ల వరకు వసూళ్ళు సాదించినట్టు సమాచారం. ఈ సినిమాలో నిత్యా పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగు లో ‘గంగ’ పేరుతొ అనువాదం అయిన ఈ సినిమా మే 1 న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.