నిర్మాతతో కంప్రమైజ్.. హీరోయిన్ గా ఛాన్స్..!

17 Apr 2015

సినిమాలలో హీరోయిన్ అవ్వాలి అంటే కంప్రమైజ్ అవటం కామన్ అనే మాట జగమెరిగిన సత్యం. హీరోయిన్ అనే కాదు.. ఏ  చిన్న వేషానికైన అమ్మాయిలకు కమిట్ మెంట్.. విత్ అవుట్ కమిట్ మెంట్.. అనే ఒక కండిషన్ ఉంటుంది. కమిట్ మెంట్ అంటే.. నిర్మాతలు, దర్శకులు లేదా సినిమాతో సంబంధం ఉన్న ప్రత్యేకమైన వ్యక్తులతో ప్రైవేట్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. విత్ అవుట్ కమిట్ మెంట్ అంటే అలాంటివి  ఉండవు. కాని విత్ అవుట్ కమిట్ మెంట్ తో అవకాశాలు రావటం చాలా అరుదు.
 
ఈ నేపద్యంలోనే తాజగా ఒక కధనం వినపడుతుంది. ఒక మల్టీ స్టారర్ సినిమాకు ఒక అందమైన కొత్త హీరోయిన్ కావాల్సి వచ్చింది. అందుకోసం ఆడిషన్స్ జరిగాయి. 30 మంది అమ్మాయిలను వడపోసి.. ఇద్దరు అమ్మాయిలను ఫైనల్ లిస్టులో ఉంచారు. ఇద్దరు అన్ని విషయాలలోనూ దాదాపు సమానంగా ఉన్నారు. వారిలో ఎవరిని తీసుకోవాలి అన్న విషయంగా సినిమా యూనిట్ లోని అందరి అభిప్రాయాలూ తీసుకున్నారు. చివరికి నిర్మాత ఓకే చేసిన అమ్మాయిని తీసుకుని త్వరలోనే సినిమా మొదలుపెట్టాబోతున్నారు.
 
ఇంతకీ నిర్మాతకు ఆ అమ్మాయిలో నచ్చిన విషయం ఏమిటో.. ప్రత్యేకంగా చెప్పాలా..? కమిట్ మెంట్ కు ఒప్పుకుంది.. గెస్ట్ హౌస్ లో ప్రైవేట్ టైం గడిపింది.. హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది..! ఇక్కడ రెండో అమ్మాయి కూడా కమిట్ మెంట్ కు ఓకేనంటా..! కాని అదృష్టం అవతలి అమ్మాయికే దక్కింది. చూశారా విచిత్రం... ఆత్మాభిమానాన్ని చంపుకోవటానికి కూడా అదృష్టం కలిసి రావాలి..!