నయనతారకు టాప్ హీరో రేంజ్..!

24 Apr 2015

పురాణాల్లో చాలామంది గొప్పవాళ్ళు చెప్పారు.. భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉండాలో రాసే ఉంటాడు.. అందుకనే  కొన్ని మనం అనుకున్నవి.. జరగవు.. కొన్ని అనుకోనివి జరిగి ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం నయనతార జీవితాన్ని అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
నయనతార ఒకసారి తమిళ హీరో శింబును పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలి అనుకుంది.. కాని కుదరలేదు. తరవాత ప్రభుదేవాతో.. జీవితాన్ని పంచుకోవాలని కలలు కంది.. కాని పరిస్థితులు కలిసిరాలేదు. నటిగానే కొనసాగుతుంది.. మంచి సినిమాలు చేస్తుంది.. ప్రోత్సాహాలు అందుకుంటుంది. పెళ్లి చేసుకుని సినిమాలు మానేస్తే.. వచ్చేది కాదు కాని... నటిగా కొనసాగుతుంది కాబట్టే.. ఆమె ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సాటి అన్న రేంజ్ లో అవకాశాలు దక్కించుకుంటుంది.
 
ఈ మధ్య ఒక వ్యాపార ప్రచారం నిమిత్తం.. నయనతార ఒక సంస్థతో 4 కోట్లకు ఒప్పందం చేసుకుందంటా..! ఇది దక్షిణ భారత సినిమా రంగానికి సంబంధించి ఒక రికార్డ్ అని మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో ఉంది కాని సౌత్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ లో ప్రచారం నిమిత్తం డీల్ జరిగిన వ్యవహారం లేదు అని మాట్లాడుకుంటున్నారు. స్టార్ హీరో రేంజ్ లో ఇంత పెద్ద డీల్ దక్కించుకోవటం మాములు విషయం కాదు.. 4 రాష్ట్రాలలో నయనతారకు ఉన్న క్రేజే అందుకు కారణం అని విశ్లేషణలు సాగుతున్నాయి.