నాగచైతన్య చిన్న హీరోనా..?

23 Apr 2015

అక్కినేని నాగచైతన్య చిన్న హీరోనా..? పెద్ద హీరోనా..? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ ఫిలింనగర్ లో జరుగుతుంది. కొంతమంది అదెంతమాట.. ఇప్పటివరకు చిన్న బాబు చిన్న బ్యానర్ లో సినిమా చేసిందే లేదు. అన్నపూర్ణ, కామాక్షి మూవీస్, వర్మ కార్పోరేషన్, గీత ఆర్ట్స్, దిల్ రాజు బ్యానర్ ఎలా అన్ని పెద్ద పెద్ద బ్యానర్ లలోనే సినిమా చేశాడు. సమస్య లేదు చైతు బాబు చిన్న హీరో కాదు అంటున్నారు.
 
కాని కొంతమందేమో.. అవునా..  పెద్ద హీరో అయితే.. ఆ నిర్మాత ఎందుకల నాగచైతన్యతో చిన్న సినిమా తీస్తున్నాను అని ప్రకటించాడు అని దెప్పి పొడుస్తున్నారు. ఇంతకీ నాగచైతన్య పరువు మీద ప్రశ్నలు వేసే అవకాశాన్ని కల్పించిన నిర్మాత ఎవరో తెలుసా..? జులాయి, S /O సత్యమూర్తి సినిమాలను రూపొందించిన రాధాకృష్ణ. ఆయన ఏమిచేశాడు అంటే..
 
నాగచైతన్య హీరోగా కార్తికేయ దర్శకుడు చందూ మొండెటి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించటానికి పూనుకున్నాడు. పొతే ఆ సినిమాను తన రెగ్యులర్ బ్యానర్ హారిక హాసిన ప్రోడుక్షన్ లో కాకుండా వేరే బ్యానర్ లో చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఎందుకు అని ఎవరో అడిగితే.. రెగ్యులర్ బ్యానర్ లో పెద్ద సినిమాలు మాత్రమే చేస్తాను అని చెప్పారంటా...! అంతే.. అక్కడినుండి అనుమానాలు మొదలయ్యాయి. అంటే.. నాగచైతన్య పెద్ద హీరో కాదా..? అని కొంతమంది ఎగేశారు.. ఇప్పుడు చర్చ గట్టిగానే జరుగుతుంది. మరీ ఈ విషయంగా నిర్మాత ఎలా స్పందిస్తారో.. చూడాలి.