నారా వారి హీరో కొత్త రికార్డ్ ..!

26 Apr 2015

నారా వారి హీరో రోహిత్ బాబు పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. రాజకీయాలలో లాగా ఒకసారి గెలిస్తే.. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు.. ఒక్క సినిమా హిట్ అయితే.. దానినే కొన్నాళ్లపాటు చెప్పుకుంటూ హీరోకు భజన జరుగుతూ ఉంటే.. బాగుంటుంది. అలా జరిగితే.. నారా రోహితే.. ముందు సంతోష పడే హీరో అవుతాడు అనుకోవచ్చు.
ఎందుకంటే.. ఇప్పుడు నారా రోహిత్ ను చూసి మైమరచిపోయే పరిస్థితిలో అయితే.. తెలుగు ప్రేక్షకులు లేరు. ఆయనకు కూడా ఈ విషయం పై పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. ఏదో ఆయన ఫ్రెండ్స్.. నారా ఫ్యామిలీ మీద అభిమానం ఉన్నవాళ్లు సినిమా చూస్తే చాలు అన్నట్టే.. సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో పైన చెప్పిన విధానం రోహిత్ ను సంతోషపెడుతుంది అనటంలో సందేహ పడనవసరం లేదు. రోహిత్ మీద నమ్మకం కంటే.. చంద్ర బాబు గారి మీద అభిమానంతోనే.. డబ్బులు రాకపోయినా వరసెంబడి ఆయనతో సినిమాలు తీస్తున్న.. పరిస్థితి ఉంది.
రోహిత్ బాబు చాలా సినిమాలు మొదలవుతున్నాయి కాని రిలీజ్ అవకపోవటాన్ని అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బయటకు రావాల్సిన సినిమాలు పేరుకుపోతునప్పటికి కొత్త సినిమాలు ప్రారంభం కావటం మాత్రం ఆగటంలేదు. పరిస్థితి ఇలాగే సాగితే… ఈ విషయంగా రోహిత్ బాబు ఒక కొత్త రికార్డ్ సృష్టించటం ఖాయం అనే వినిపిస్తుంది. పొతే ఈ క్రమంలోనే రోహిత్ తాజాగా మరో కొత్త సినిమాకు జెండా ఊపాడు. తమిళంలో వచ్చిన ‘మాన్ కరాటే’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రోహిత్ పక్కన హన్సిక నటించే అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నారు.