ముఖ్యమంత్రి షాకులకి మంత్రులు తట్టుకోలేక పోతున్నారు

20 Apr 2015

బ్రిటీష్ కాలం లో అలవడిన అడ్డవైన 'సలాం' లు మనకెందుకు అనుకున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవిస్ . ఆయన ఏం చేసిన వింతే కాబట్టి అందులో భాగంగా వీలైనంత వీ ఐ పీ కల్చర్ కి దూరం పెడదాం అని ఆలోచిస్తున్నారు . అధికారం లో ఉన్న నేతలకు బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న

సెల్యూట్ కి ఆయన స్వస్తి పలికేసారు మరి . మంత్రులకు అక్కడ వారు ఎవ్వరూ సెల్యూట్ పెట్టద్దు అని గౌరవ వందనం బంద్ చెయ్యాలి అని ప్రకటించారు . అంతే కాకుండా వీవీఐపీ భద్రతా విషయం లో కూడా ఓవర్ భద్రత హడావిడి లేకుండా చూస్తున్నారు ముఖ్య మంత్రి . పోలీసులు మాత్రం అడ్డవైన మంత్రులకి సెల్యూట్ చేసే పని తప్పింది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వ అధికారులు , మంత్రులు అంటే ప్రజలకి సేవ చెయ్యాలి కానీ భద్రత తో , తమ హోదా ని చూపించుకుంటూ తిరగడం కాదు అనే ఉద్దేశ్యం తో ఉండే ముఖ్య మంత్రి ఈ రకమైన నిర్ణయాలు ఫ్యూచర్ లో ఎన్ని తీసుకుంటారో చూడాలి మరి.