ముదురుతున్న వర్మ.. లక్ష్మి అభిమానం!

4 Apr 2015

వివాదాలను కావాలని సృష్టించి పబ్బం గడుపుకుంటున్న ఒకప్పటి క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ.. ఇటీవలి కాలంలో అందరిని ఆడిపోసుకునే కార్యక్రమాలే ఎక్కువగా పెడుతున్నాడు. అతి కొద్ది మంది గురించి మాత్రమే నాలుగు మంచి ముక్కలు మాట్లాడుతున్నాడు. వారిలో కూడా కొంతమంది పై ప్రత్యేకమైన పొగడ్తలు కురిపిస్తున్నాడు. ముఖ్యంగా మంచు లక్ష్మి మీద ఆయన ప్రదర్శిస్తున్న స్పెషల్ ఆసక్తిని చూస్తుంటే.. అసలేం అనుమానాలు కలగటంలేదు.. అని చెబితే అబద్దమే అవుతుంది.
 
మంచు ఫ్యామిలీతో ఫెవికాల్ బందాన్ని ఏర్పాటు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న వర్మ మంచు లక్ష్మి పై ఒక షార్ట్ ఫిలిం తీసి అందరు ముక్కు మీద వేలేసుకునేట్టు చేశాడు. లక్ష్మి పదాల గురించి ఆయన చేసిన షార్ట్ ఫిలిం చూస్తే.. వర్మకు ఆమె మీద ఉన్న శ్రద్ధను ఇట్టే పసిగట్టేయ వచ్చు. అక్కడితోనే అయిపోలేదు.. మంచు లక్ష్మి ఎటువంటి చిన్న ఘనకార్యం చేసినా.. ఆమెను పొగడటానికి ఫస్ట్ లైన్ లో నిల్చుంటున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళకే లేనిపోని పోనీ వంకలు పెట్టే వర్మ లక్ష్మిని కొత్త కొత్త పదాలు వెతికి మరీ పోగుడుతున్నాడు.
 
తాను తాజాగా చేస్తున్న 'దొంగాట' సినిమా కోసం మంచు లక్ష్మి తోలిసారి పాట పాడింది. ఆ పాట వినటానికి కర్ణకఠోరంగా ఉన్నా.. వర్మ గారికి తెగ నచ్చేసింది అంటా..! పాట అలా బయటకు వచ్చిందో.. లేదో.. కాసేపటికే వర్మ లక్ష్మి మీద పొగడ్తల పురాణం మొదలెట్టేశాడు. ఈ తంతు చూసి.. జనాలు లక్ష్మి పై వర్మ అభిమానం బాగా ముదిరి పాకనా పడ్డట్టుందే.. అనుకుంటున్నారు.