మడి విప్పేసిన నిత్య మీనన్..!

7 Apr 2015

నిత్యా మీనన్.. ఈ పొట్టి కేరళ కుట్టి గురించి తెలియంది ఎవరికీ..! పొట్టి వారు గట్టి వారు అన్నట్టు.. ఈ గడుగ్గాయి మల్టీ టాలెంట్స్ తో దక్షిణ భారత సినిమా ప్రేక్షకులలో చాలా మందిని తన అభిమానులను చేసేసుకుంది. నటన, పాటలు పడటం సహా చాలా రకాలుగా అభిమానులను మెప్పించింది... కాని ఎక్స్ పోజింగ్, శృంగారం విషయాలుగా మాత్రం మడికట్టుకు కూర్చుంది. పోనిలే బుద్దిమంతురాలు అనుకున్నారు అందరు..! కాని ఇప్పుడు ఆ బుద్ది ఎందుకు మారిందో కాని మడితీసి పక్కన పెట్టేసింది.
 
ఈ వేసవిలో సౌత్ ప్రేక్షకులకు తన అందాలతో మరింత తాపాన్ని పెంచే పనిలో నిత్యా మీనన్ ఉందని తెలుస్తుంది. రెండు సినిమాలతో ఆమె శృంగార ప్రియులకు చెమటలు పట్టించే కార్యక్రమాన్ని పెట్టుకుంది అని అర్ధ అవుతుంది. ఇంతవరకు పద్దతిగా ఉన్న ఆమె.. త్రివిక్రమ్ కోసం కొన్ని సవరింపులు చేసుకుని పొట్టి బట్టలేసుకుని అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది అని తెలుస్తుంది. S /O సత్యమూర్తి సినిమాలో నిత్యా తనలోని కొత్త షెడ్ చూపించనుంది అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
 
నిత్యా మణిరత్నం కొత్త సినిమా 'ఓకే బంగారం' లో కూడా నటిస్తుంది. ఆ సినిమాలో మణిరత్నం మలచిన శృంగార దేవతగా నిత్యా కుర్రకారు మనసులను కొల్లగోట్టటం ఖాయం అని తమిళ సినిమా మనుషులు చాలెంజ్ లు చేస్తున్నారు. ఆ సినిమా కోసం నిత్యా కొంచెం సన్నబడి.. మరింత అందంగా కనిపిస్తుంది.. ట్రైలర్స్ చూస్తుంటే.. ఆ విషయం అర్ధం అవుతుంది. అది కధ.. మరి.. మడి విప్పేసిన నిత్యా.. ఎంత మంది మతి పోగోడుతుందో.. ఈ నెలలో తెలిపొద్ది..! ఎలా అంటే S /O సత్యమూర్తి, ఓకే బంగారం ఈ నెలలోనే విడుదల అవుతున్నాయి కాబట్టి..!