మహేష్ కంటే రానా గొప్పా..?

17 Apr 2015

ఆజానుబాహుడు రానా ఇప్పుడు హైదరాబాద్ వాసులందరూ మహావీపరీతంగా కోరుకుంటున్న వ్యక్తుల్లో నెంబర్ వన్ అనిపించుకున్నాడు. ఇదిగోండి.. రానా మాకు నెంబర్ వన్ అనిపించాడు అందుకే ప్రకటిస్తున్నాం  అన్నట్టుగా టైమ్స్ దినపత్రిక ప్రకటించినట్టైతే ఏ గొడవ ఉండేది కాదు. కాని హైదరాబాద్ వాసులందరిని ఓటింగ్ చేయమని అభ్యర్దించి.. ఆ ఓట్లను లెక్కేసి.. రానా బాబు టాప్ అని ప్రకటించటాన్ని మాత్రం ఎవరు సమర్దించటంలేదు.
 
అలా ఎందుకు సమర్ధించటం లేదు అంటే.. రానా బాబు  మాములు హీరోలను.. చిన్న హీరోలను దాటుకుని నంబర్ వన్ అనిపించుకున్నాడు అంటే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కాని ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా కాకలు తీరిన స్టార్ హీరోలను దాటుకుని నం 1 అయ్యాడు. ఈ నిజాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కొంతమంది తట్టుకోలేని ఇంకో మేటర్ ఉంది.. అదేమంటే.. మహేష్ బాబు ను రెండో స్థానంలో ఉంచి రానా ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. మహేష్  పైన రానానా.. అసలిది ఎలా సాధ్యం.. అని సహనాన్ని కోల్పోయి ఖండిస్తున్న వాళ్ళ సంఖ్య బాగానే పెరుగుతుంది.
 
టైమ్స్ పత్రిక ఈ ఓటింగ్ ఏ ప్రాతిపదికన నిర్వహించింది? అసలు ఎక్కడ నిర్వహించింది? వారి పేపర్ చదివే వాళ్ళు నలుగురు ఓటేస్తే సరిపోతుందా? ఇష్టానికి పోజిషన్స్ ఇచ్చేస్తారా..? పరిస్థితి చూస్తుంటే.. టైమ్స్ పడిపోతున్న వాళ్ళ పత్రిక ఇమేజ్ ను పెంచుకోవటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని గట్టిగా విమర్శిస్తున్నారు కొంతమంది పెద్దలు. ఎప్పుడూ మహేష్ బాబే అంటే.. వెరైటీ ఏముంటుంది..? కొద్దిగా తెలివి ఉపయోగిస్తే.. కావాల్సినంత రగడ జరుగుద్ది.. అనుకున్నంత ప్రచారం వస్తుంది..! ఆ ప్రకారమే ఇప్పుడు టైమ్స్ ఐడియా బాగానే వర్క్ అవుట్ అయినట్టుంది..!