ఇరకాటంలో మహేష్ బామర్ది..!

25 Apr 2015

నా ముందు మహేష్ అభిమానులు ఉన్నారు.. నా వెనుక మహేష్ బాబు ఉన్నాడు.. నాకు ఇబ్బందే లేదు అని వేదికల మీద గట్టిగానే మాట్లాడుతున్న సుధీర్ బాబుకు సినిమాల విజయాల పరంగా అనుకున్నంత ప్రోత్సాహం లభించటం లేదు. కాని మనిషి మాత్రం ఒళ్ళంతా సిక్స్ ప్యాక్ లు.. ఆ ప్యాక్ లు.. ఈ ప్యాక్ లు.. అంటూ తెగ హూనం చేసుకుంటున్నాడు.
సుధీర్ బాబు కష్టానికి తప్పకుండా ఒక బ్రేక్ వస్తుంది అని అందరు ఎదురు చూస్తున్నారు. కాని బ్రేక్ బదులు అసలు అతని సినిమాలు విడుదల అవటమే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మహేష్ పుణ్యమా అని సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి.. కాని సినిమాలు మాత్రం బయటకు రావటంలేదు. మొన్న ఒక సినిమా అలానే ఆడియో వేడుక జరుపుకుని ల్యాబ్ లో భద్రంగా పడుకుంది. ఇప్పుడు ఇంకో సినిమా ఆడియో వేడుక జరుపుకుంటుంది.
కన్నడ సినిమా ‘చార్మినార్’ రిమేక్ గా రూపొందిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఆ వేడుకలో సుధీర్ బాబుకు సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది అని మాట్లాడారు. కై సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. ఇప్పుడు మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా త్వరలో ఆడియో వేడుక జరుపుకోనుంది.. మరీ ఈ సినిమా అన్న విడుదల అవుతుందా..? అవకపోతే మాత్రం.. మహేష్ బామర్ది ఇరకాటంలో పడ్డట్టే..!