మహేష్ పై నిందలు

1 Apr 2015

సూపర్ స్టార్ అన్నాక..  పొగడ్తలు, ప్రశంశలే కాదు.. నిందలు, అవమానాలు, వెక్కిరింతలు ఇలా చాలా రకాల భావోద్వేగాలను భరించాల్సి వస్తుంది. ఎప్పుడు.. ఎవరు.. ఎందుకు  పొగుడుతారో.. ఎందుకు  ఆడిపోసుకుంటారో.. ఒక పట్టానా అర్ధం చేసుకోలేని పరిస్థితి. ఒక విశేషం ఉన్న కార్యక్రమానికి సంబంధించి.. తన స్పందనను తెలియజేయనందుకు మహేష్ బాబు ఇప్పుడు ఓ భారి నిందను మోయాల్సిన వాతావరణం ఏర్పడింది.
ఇంతకీ సంగతి ఏమిటి అంటే.. 2015 మార్చి 31 తో సూపర్ స్టార్ కృష్ణ తన సినిమా ప్రస్థానాన్ని మొదలు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యావత్ తెలుగు సినిమా పరిశ్రమ ఆయనకు అభినందనలు తెలిపింది. అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలోను వేడుకలు నిర్వహించారు. అలానే చాలామంది ప్రముఖులు కృష్ణగారికి శుభాభినందనలు తెలిపారు. ఇంతలా ఆయన 50 సంవత్సరాల పండగ పై అందరు స్పందిస్తే.. ఆయన కుమారుడు మహేష్ బాబు ఈ విషయంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం భాదాకరం అని కొంతమంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు బహిరంగంగా ప్రెస్ ముందుకు వచ్చి.. తన స్పందన తెలియజేయాల్సిన అవసరంలేదు.. ఒక చిన్న మెసేజ్ తన ట్విటర్ అకౌంట్ లో పెడితే ఎంత గొప్పగా ఉండేది. కృష్ణ గారు సాదించింది మాములు ఘనత కాదు కదా.. అది అందరికి సాధ్యపడే విషయం అంతకంటే కాదు.. అలాంటి గొప్ప సంగతి గురించి మహేష్ మాట్లాడాల్సిన భాద్యత ఉంది కదా? మహేష్ ఇలా చేయటం అసలేం బాగాలేదు అని కొంతమంది కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. చూడాలి మరీ.. తన పై పడిన ఈ నిందకు మహేష్ ఎటువంటి సమాధానం ఇస్తారో..?