'మా' ఎంటర్ టైన్మెంట్ ఇంకా ఉంది..!

24 Apr 2015

మా ఎన్నికల మూలంగా తెలుగు ప్రేక్షకులకు అందిన వినోదానికి తెర పడింది అనుకున్నారు అందరు. కాని అవకాశమే లేదు.. జనాలను ఎంటర్ టైన్ చేయాల్సిన సంగతి ఇంకా చాలా ఉంది. రాజేంద్ర ప్రసాద్ 'మా' అద్యక్షుడిగా ఉంటున్న రెండు సంవత్సరాలు ఇది కంటిన్యూ అవుతుంది... చూస్తూ ఉండండి అని సంకేతాలు ఇస్తున్నారు 'మా' పెద్దలు.
 
'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత రాజేంద్ర ప్రసాద్ తెలంగాణా CM KCR ను కలిశారు. కలిసి తెలుగు సినిమా కష్ట సుఖాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఈ విషయానికి సంబంధించి 'మా' సభ్యుడు నరేష్ వివాదాన్ని లేవనెత్తే పనిమొదలు పెట్టాడు. 'మా' కార్యవర్గంలో ఎంత మంది సభ్యులు ఉంటే.. రాజేంద్రప్రసాద్ ఇష్టానికి CMను కలిసివస్తే.. ఎలా కుదురుతుంది...? మాతో ఒకమాటైన చెప్పాలిగా..! అలానే గెలిచాకా చిరంజీవిని కలిశారు... ఎందుకు.. పరిశ్రమలో ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారుగా..? వాళ్ళని కలవలేదేమి..? అని సూటి ప్రశ్నలు వేశాడు.
 
నరేష్, రాజేంద్రప్రసాద్ వేరే వర్గాల నుండి నిలబడి ఎన్నికల్లో పోటి చేశారు. అందుకనే.. రాజేంద్రప్రసాద్ ను ప్రశ్నించే పనిని నరేష్ మొదలెట్టారు. ఇది.. ఇలానే కొనసాగే అవకాశం ఉందని వినికిడి..! ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు నాయుడును కలిశారు. మరీ దీని గురించి నరేష్ ఏమని కామెంట్ చేస్తారో చూడాలి.