కమల్ హసన్ కూతురైతే ఏమంటా..?

1 Apr 2015

MLA చుట్టం అయితే రూల్స్ పాటించనవసరంలేదు.. పలుకుబడి ఉన్నవ్యక్తి మనవాడైతే.. చట్టాలు పట్టించుకొనవసరంలేదు.. వంటి రుబాబులు అన్నిసార్లు వర్క్ అవుట్ కావు. కొన్నిసార్లు దురదృష్టం వెంటాడి.. చట్టం తన పని తానూ చేసుకుంటూ పోతుంది. అప్పుడూ..  వళ్ళు దగ్గర పెట్టుకోవటం మినహా మరో పని చేయటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కమల్ హసన్ పొడుగుకాళ్ల అందమైన కూతురు శృతి హసన్ పరిస్థితి కూడా అలానే ఉంది.
విషయం ఏమిటి అంటే.. శృతి హసన్..  నాగార్జున, కార్తి కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో నటించటం కోసం PVP సంస్థతో ఒప్పందం చేసుకుంది. కాని ఆ తరవాత హిందీ సినిమాలో నటించే అవకాశం కోసం షూటింగ్ మొదలైన తరవాత వంకలు చెబుతూ కొన్నాళ్ళు నాన్చి.. ఆ పై నాకు డేట్స్ లేవు..  నేను సినిమా చేయలేను అని చెప్పిందంటా..! దాంతో కోపం నషాళానికి ఎక్కిన నిర్మాత కోర్టులో కేస్ పడేశాడు. నిర్మాత భాదను అర్ధం చేసుకున్న కోర్ట్.. కొత్త సినిమాలు ఒప్పుకోవటం చేయవద్దు.. విచారణ తరవాత నీ సినిమాల సంగతి చూసుకుందువు అని శ్రుతికి ఆర్డర్ వేసింది.
మొదట్లో లైట్ తీసుకున్నా.. తరవాత కోర్టులో వ్యవహారం స్ట్రాంగ్ గా ఉంది అని అర్ధ అయ్యి.. ఇప్పుడు రాయబారాలు మొదలుపెట్టిందంటా.. శృతి. ఇప్పటికే విసిగిపోయిన నిర్మాతలు.. ఆమె ప్లేస్ లో తమన్నాను తీసేసుకున్నారు. మేము చేసేది ఏమిలేదు.. అంతా కోర్ట్ చూసుకుంటుంది అని.. నిర్మాతలు శృతి సంధి మాటలను పట్టించుకోవటంలేదంటా..! వాళ్ళని సముదాయించే పనిలో శృతి తరుపు మనుషులు నానా అగచాట్లు పడుతున్నారని సమాచారం... ! చూడాలి మరీ.. ఈ వ్యవహారం నుండి శృతి ఎలా బయటపడుతుందో...!