Jr NTR తండ్రిగా హరికృష్ణ..!?

22 Apr 2015

నటులుగా ఉన్న తండ్రి కొడుకులు.. అపుడప్పుడు సినిమాల్లోనూ.. తండ్రి కొడుకులుగా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. శివాజీ గణేశన్, ప్రభు.. అక్కినేని నాగేశ్వర రావు నాగార్జున.. ఇలా కొంతమంది ఉన్నారు. తాజాగా చర్చల్లోకి వస్తున్న సమాచారం ప్రకారం Jr ఎన్టీఆర్ ఆయన తండ్రి హరికృష్ణ కలిసి నటించే అవకాశం లేకపోలేదు అని ప్రచారం జరుగుతుంది.
 
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న కొత్త సినిమాలో నాన్న పాత్రకు విపరీతమైన ప్రాధాన్యం ఉందటా..! అందుకోసం చాలా మంది నటులను పరిశీలించారు. జగపతి బాబు, మోహన్ లాల్ సహా కొంతమంది నటులను చూశారు కాని ఎవరు సెట్ అవలేదు. అన్ని అవకాశాలు చూసి చివరికి హరికృష్ణ దగ్గర ఆగారని వినికిడి. పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని పరుగానలోకి తీసుకుంటే.. హరికృష్ణ చక్కగా సరిపోతాడని చిత్ర యూనిట్ భావించినట్టు తెలుస్తుంది.
 
కానీ హరికృష్ణ నటించే ఆలోచనలో లేరని.. దాదాపు ఆయన నటించకపోవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్త తెలిసిన దగ్గర నుండి మాత్రం.. నందమూరి అభిమానులు హరికృష్ణ నటిస్తే.. గొప్పగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరీ.. ఈ విషయంగా ఎన్టీఆర్ ఎటువంటి చొరవ చూపిస్తాడో..!