Jr NTR కు బాలయ్య పర్మిషన్ కావాలంటా..!

9 Apr 2015

ఇటీవల Jr NTR కు సంబంధించిన ఒక వార్త.. అటు రాజకీయ వర్గాలను.. ఇటు సినిమా వర్గాన్ని అమితంగా ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న Jr.. తెలుగు దేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తో సమావేశం అయ్యాడన్నది ఆ వార్త.
 
బయట అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పార్టీ వ్యవహారాల్లో మళ్లీ ఉత్సాహంగా పాల్గొనాలి అన్న ఆసక్తితోనే ఎన్టీఆర్ లోకేష్ ను కలిసాడని మాట్లాడుకుంటున్నారు. చర్చ అనంతరం లోకేష్..  తప్పకుండా పార్టీ వ్యవహారాల్లో పాల్గొనవచ్చని.. ఆ స్వేఛ్చ నీకు ఎప్పుడూ ఉంటుందని.. పార్టీతో ఎలా కలిసి పనిచేయలనేది నీ ఇష్టం అని ఎన్టీఆర్ తో అన్నట్టు తెలుస్తుంది. ఇంతాచెప్పి లోకేష్ చివర్లో ఒక మెలికపెట్టాడు అంటా.. !
 
అదేమంటే.. నాకైతే నువ్వు పార్టీలోకి వస్తే.. ఎటువంటి ఇబ్బంది లేదు.. కాని ఒకసారి.. బాలకృష్ణ మామయ్యను కూడా కలవండి.. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుని అప్పుడు కార్యరంగంలోకి దిగండి అని సలహా ఇచ్చడంటా..! పొతే లోకేష్ డొంకతిరుగుడు మాటలకూ హర్ట్ అయిన Jr NTR బాలయ్యను కలిసే అవకాశం ఉండకోవచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అలానే ఈ సమాచారంలో వాస్తవం ఎంత ఉందనేది కూడా తేలాల్సి ఉంది.