జిల్ బేబికి ఉచిత సలహా..!

5 Apr 2015

ఊహలు గుసగుసలాడే సినిమాలో పద్దతిగా.. బొద్దుగా కనిపించిన రాశికన్నాను చూసి సంప్రదాయమైన పిల్లలా ఉందే.. అని చాలా మంది అనుకున్నారు. కాని తరవాత 'జోరు' సినిమాలో తన ఒరిజినల్ ను బయటకు తెచ్చి కుర్రకారుకు వేడెక్కించింది. ఇక మొన్న వచ్చిన 'జిల్'తో మేడం సిరియల్ కిస్సర్ అనే స్టాంప్ వేయించుకునే స్థాయికి ఎదిగింది.
 
అలానే మొన్నటి వరకు చూసి చూడనట్టు ఉన్న సినిమా జనాలు 'జిల్' తరవాత రాశి మీద పెద్ద కన్నే వేస్తున్నారు. అవకాశాలతో అమ్మడిని ఉక్కిరి బిక్కిరి చేయాలి అని కూడా డిసైడ్ అయిపోతున్నట్టు సమాచారం అందుతుంది. దాదాపు అప్ కమింగ్ హీరోలు మొదలు సెటిలైన హీరోలు సహా స్టార్ హీరోలు వరకు రాశిని ఒకసారి పరిశీలనలోకి తీసుకునే రేంజ్ ఆమెకు వచ్చేసింది అని ఫిలిం నగర్ టాక్. ఓ పక్క పరిస్థితులు ఇంత పాజిటివ్ గా ఉంటే... మరో పక్క ఆమెలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ ఉచిత సలహాలు ఇస్తున్నవాళ్ళు కొంతమంది తయారైయ్యారు.
 
వాళ్ళు చెబుతున్న దాంట్లోనూ కొంత నిజం ఉంది.. అమ్మడు కొంచెం వళ్ళు తగించుకుంటే మంచిది. ఇప్పటికే చిన్న హీరోల పక్కన చూస్తుంటే ఆంటీలా కనిపిస్తుంది. ప్రతిసారి వయసెక్కువ ఉన్న హీరోలతోనే చేయాల్సి ఉండదు కదా.. అందరితో పనిచేయాలి కదా.. సో.. కాస్తా సన్నబడితే.. నాలుగు సినిమాలు చేసుకోవచ్చు అని పద్దతిగానే మాట్లాడుతున్నారు.. మరీ ఈ మాటలు రోజు రోజుకు బొద్దై పోతున్న రాశికి వినపడతాయో.. లేదో..?