ఇంకెన్నాళీ.. ఉదయ భాద!

8 Apr 2015

ఒకప్పుడు అందమైన యాంకర్.. మహాబాగుంటుందిలే అని కుర్రకారు బాగా మనసులు పారేసుకునేవారు ఉదయబాను మీద..! ఇప్పుడూ కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు  ఆమె అభిమాన సంఘంలో ఉన్నారులెండీ...! కాకపోతే వయసైపోతుంది.. అలానే కొత్త కొత్త యాంకర్స్ వస్తున్నారు.. కారణంగా చాలా మంది తగ్గిపోయారు.
 
ఉదయబాను యాంకరింగ్ చేస్తున్న కొత్తలో..  ఆవిణ్ణి ఎంతసేపైనా.. చూస్తూ ఉండాలనిపించేది, ఎందుకంటే.. హీరోయిన్లను తలపించేలా.. డ్రెస్ లు వేస్తూ.. రచ్చ చేసేది! ఇప్పుడలా డ్రెస్ వేసుకోవటం లేదా.. అంటే.. వేసుకుంటుందీ.. కాకపోతే అప్పుడున్నంత మెరుపు కనిపించటంలేదు. దానికారణంగా మొన్నటివరకు ఆమె అందాన్ని చూసి మైమరచిపోయిన జనం.. ఇప్పుడు అందం కాకుండా మాటల మీద దృష్టి పెడుతున్నారు! మరి..  ఆవిడ మాటల్లో మేటర్ తక్కువ.. మోత ఎక్కువ... దాంతో ఆవిడా యాంకరింగ్ చేస్తున్న ప్రతిసారి.. ఇంకెన్నాళీ.. ఉదయ భాద! అని బుర్రలు బాదుకుంటున్నారు.
 
కాని ఈ విషయాలను పట్టుంచుకునే స్థితిలో లేని బాను తానో.. యాంకరింగ్ సూపర్ స్టార్ అయినట్టు ఫీల్ అయిపోతూ.. జనాల సహనాన్ని క్వింటల్లో కొలుస్తుంది. ఉదయభాను యాంకరింగ్ అంటే.. వామ్మో.. అని చానెల్స్ తిప్పేస్తున్న వారి సంఖ్య బాగానే పెరుగుతుందని ఒక సర్వే..! పరిస్థితి అయితే.. అది. కాని ఈ విషయాన్నీ ఉదయభానుకి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.. ఎందుకంటే.. ఆమె నోరేసుకుని పడిపోతే.. ఇంకేమైనా ఉందా..?