ఎడ్వలేక మంగళ వారం అన్నట్టు.. మెగా అభిమనులాదే తప్పంటా..!

4 Apr 2015

మనవాళ్ళు ఒక సామెతను సాదారణంగా వాడుతూ ఉంటారు.. ఏమి చేయలేని దద్దమ్మా.. మంగళవారం ఏ పని చేయకూడదు.. చేస్తే కలిసి రాదు అని చెప్పి తప్పించుకునే వంకలు మాట్లాడతాడు అని చెబుతుంటారు. ఇప్పుడు 'రేయ్' సినిమా విషయంగా అటువంటి వంకలే చెబుతున్నారు అని మార్కెట్ లో మాట్లాడుకుంటున్నారు.
 
గత శుక్రవారం విడుదలైన 'రేయ్' సినిమా బ్యాడ్ రివ్యూస్ దక్కించుకుని బాక్స్ ఆఫీసు దగ్గర చతికిలపడే పరిస్థితిలో కొట్టు మిట్టాడుతుంది. సినిమా బాగాలేదు అన్నది ప్రధానమైన కారణం అయినప్పటికీ.. దానిని పక్కన పెట్టి వేరే వంకలను సినిమా పరాజయానికి కారణాలుగా చూపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రత్యేకంగా వినిపిస్తుంది ఏమంటే.. మెగా అభిమానులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవటం మూలంగానే సినిమాకు ఎక్కువ నష్టం జరుగుతుందని.. ప్రచారం చేయటం..!
 
పొతే ఈ ప్రచారానికి మెగా అభిమానులు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. అసలు సినిమాలో విషయమే లేదు.. మెగా ట్యాగ్ లేకపోతే.. ఈ సినిమా ముఖం చూసేవాళ్ళు కూడా ఉండరు. మెగా హీరో సినిమాలో ఉన్నాడు కాబట్టే.. బి, సి సెంటర్స్ లో 40 శాతం కలక్షన్లు వస్తున్నాయి. ఆ మాత్రం కలక్షన్లు వస్తున్నాయి అంటే.. మెగా అభిమానుల పుణ్యమే..! ఆ విషయం తెలుసుకోకుండా ఇష్టానికి మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరిక్కడా..! అని ఘాటుగానే స్పందిస్తున్నారు మెగా ఫాన్స్. బాగాలేదని రిపోర్ట్స్ ఉన్నా.. కలక్షన్లు పెంచుకోవటానికి అన్ని అవకశాలను ఉపయోగించుకుంటుంది చిత్ర బృందం. అందులో భాగంగా వాళ్ళు లేవదీసిన ఈ ఐడియా పెద్దగా వర్క్ అవుట్ అయినట్టు కనిపించటంలేదు. ఇప్పుడు ఇంకేదైనా కొత్త ఐడియా ట్రై చేస్తారేమో.. చూడాలి..!