డమ్మీ బర్త్ డే కే అంత హంగామానా????

22 Apr 2015


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు 4.20..! ... అని అందరూ అనుకుంటున్నారు. కానీ... కొంతమందికి తెలిసినప్పటికీ కూడా తెలియనట్లుగా నటించే అసలు విషయం ఏంటంటే... అది చంద్రబాబు అసలు బర్త్‌డే కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చంద్రబాబు స్వయంగా తన పార్టీ అనుచరులకు పదేపదే చెప్పుకున్న.. ప్రకారం.. ఆయన పుట్టిన రోజు ఎప్పుడో ఆయనకు కూడా తెలియదట.
గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ మర్మం ముడి విప్పారట. తన తల్లిదండ్రులకు కూడా వాస్తవంగా తను పుట్టినరోజు ఎప్పుడో తెలిదని.. ఏప్రిల్‌ 20 అనేది స్కూలు రికార్డుల కోసం రాసినది మాత్రమేనని ఆయనే తన అనుచరులతో బాబు చెప్పాడట!