దగ్గుబాటి సురేష్ బాబు ఒక మొనార్క్ , మూర్ఖుడు

20 Apr 2015

ఎప్పుడూ వివాదాలలో ఉండే సినిమా మనిషి నట్టి కుమార్ మళ్ళీ సంచలనమైన వార్తతో మీడియా కి కావలసినంత న్యూస్ ఇచ్చారు . ఈ సారి ఏకంగా నిర్మాతల మండలి లో ఉన్న 16 కోట్ల ఫండ్ ని 14 మంది నిర్మాతలు అడ్డం గా మేక్కేసారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు . మీడియా కూడా ఇద్దరి చేతులలో ఉండిపోయింది అని చెప్పుకొచ్చారు . " కేవలం కొంతమంది చేతులలోనే సినిమా ధియేటర్ ల దగ్గర నుంచి మీడియా సంస్థల దాకా ఉంది పోయాయి , దాదాపు 1400 మంది నిర్మాతలు ఉన్న ఈ ఇండస్ట్రీ లో 14 మంది ప్రొడ్యూసర్ లు పంది కొక్కుల లాగా ఇండస్ట్రీ మీద పడి దోచేస్తున్నారు , టీవీ లో ఏ ఛానల్ లో మా సినిమాలని ప్రకటనలు ఇచ్చుకోవలో కూడా వారే నిర్ణయించే పరిస్థితి వచ్చేసింది , వీరి వలన చిన్న నిర్మాతలు .. డిస్ట్రిబ్యూటర్ లు , బయ్యర్ లు తీవ్రం గా నష్టపోతున్నారు .ఏ పండగ వచ్చినా సరే పూర్తిగా పెద్ద హీరోలకే సినిమా ధియేటర్ లను కేటాయించి గుత్తాధి పత్యం తో పరిశ్రమ ని నడుపుతున్నారు , ఉదాహరణ కి దగ్గుబాటి సురేష్ బాబు నే తీసుకుంటే సురేష్ బాబు ఒక మోనార్క్ లాగా మూర్ఖుడు లాగా ప్రవర్తిస్తారు " అంటూ సంచలనం లేపారు .దీనికి వారి వద్దనుంచి ఎలాంటి బదులు ఉంటుందో చూడాలి మరి